Cyclone Tauktae (Photo Credits: Twitter, @indiannavy)

Mumbai, May 15: అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డ్డ తౌక్టే తుఫాన్ (Cyclone Tauktae) తీరంవైపు దూసుకొస్తున్న‌ది. మ‌రికొద్ది గంట‌ల్లో అది మ‌హారాష్ట్ర తీరానికి చేరుకోనున్న‌ది. ప్రస్తుతం తౌక్తే తుఫాన్ తీరానికి 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌దని, ఈ రాత్రికిగానీ లేదంటే రేపు ఉద‌యంగానీ అది మ‌హారాష్ట్ర‌ తీరానికి చేరుకుంటుంద‌ని (Cyclone Tauktae likely to reach Maharashtra) నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) క‌మాండెంట్ అనుప‌మ్ శ్రీవాస్త‌వ తెలిపారు. ఈ నేప‌థ్యంలో తాము ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని శ్రీవాస్త‌వ చెప్పారు.

ముంబై తీర ప్రాంతాల్లో మూడు, గోవా తీరంలో ఒక‌టి, పుణె హెడ్ క్వార్ట‌ర్స్ ద‌గ్గ‌ర 14 టీమ్‌లు విప‌త్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ తుఫాన్‌ ప‌శ్చిమ తీర ప్రాంతానికి దూరంగానే ఉన్నందున ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. అయితే బ‌ల‌మైన గాలులు, సాధార‌ణ‌ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.నైరుతి దిశలో 290 కిలోమీటర్ల దేరంటో తూర్పు కేంద్ర అరేబియా సముద్రం (Arabian sea) మీదుగా కేంద్రీకృతమై ఉందని, మే 18 మధ్యాహ్నం / సాయంత్రానికి ఇది గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Here's IMD Update

లక్ష్య దీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం బలపడి శుక్రవారం రాత్రి 11:30 గంటలకు తుఫానుగా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ రోజు ఉదయం 05:30 గంటలకు అమిని దీవికి ఈశాన్య దిశగా 160కీ.మీ. దూరంలో ఉన్నదన్నారు. ఇది మరింత బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మారి.. తరువాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించనున్నట్టు తెలిపారు.

ముంచుకొస్తున్న తౌక్టే తుఫాను ముప్పు, వాయుగుండంగా మారిన అల్ప పీడనం, ఈ నెల 8న తౌక్టే గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన ఐఎండీ

తదుపరి 12 గంటలలో ఇది మరింత బలపడి అతి తీవ్రతుఫానుగా మారి గుజరాత్ (Gujarat) తీరాన్ని పోర్బందర్ - నలియాల మధ్య 18వ తేదీ సాయంత్రం 2.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తౌక్టే తుఫాన్ ప్రభావం ఐదు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. మరోవైపు నావికా దళం కూడా రంగంలోకి దిగింది.

Here's Updates

తౌక్టే తుపాను (Cyclone Tauktae) ప్రభావంతో ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. దీంతో కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వాతావరణం భయానకంగా మారింది. కేరళలోని కసర్‌గడ్‌లో తుపాన్‌ ప్రభావంతో వీచిన గాలులకు ఒక అంతస్తు ఉన్న భవనం కుప్పకూలింది. ఆ భవనం సముద్రపు జలాల్లో కలిసిపోయింది. అదృష్టవశాత్తు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆ భవనంలో ఎవరూ లేరు.

Here's Video Update

ఈ తుపాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తుపానుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఆ తుపాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయక బృందంతో పాటు రాష్ట్రాలు తుపాను నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.