Pani Puri-Cancer Link (Credits: X)

Bengaluru, July 1: పానీపూరీ (Panipuri) అంటే ఇష్టపడని వారు ఉండరు. రోడ్డు పక్కన బండిమీద పానీపూరీని చూడగానే రివ్వుమని నాలుగైదు ప్లేట్లు లాగించేస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. పానీపూరీ తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్‌ (Cancer) కారక రసాయనాలు ఉన్నట్టు తేలింది. కర్ణాటకలో ఆహార భద్రత విభాగం అధికారులు బెంగళూరుతో సహా 79 చోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పానీపూరీ నమూనాల్లో వాటి సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో పానీ పూరీ తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాస్‌లు, స్వీట్‌ చిల్లీ పౌడర్లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే యోచనలో అధికారులు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్నికల ముందు జగన్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇప్పటికే వీటిపై నిషేధం

గోబీ మంచూరియా, కబాబ్‌ లు, పీచు మిఠాయి వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని ఇటీవల నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా, కృత్రిమ రంగుల వలన అలర్జీ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని, సింథటిక్‌ రంగులను ఎక్కువకాలం తీసుకోవడం వలన క్యాన్సర్‌ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..