Baal Aadhaar Card: చిన్నారులకు ఆధార్ కార్డు తీసుకోవడం చాలా ఈజీ! ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఆధార్ కార్డు చాలా సులభంగా వస్తుంది
No more relationship column in Aadhar Reports (Photo-Wikimedia Commons)

New Delhi December30: ప్రస్తుతం ఆధార్ కార్డే(Aadhar Card) అన్నింటింకీ ఆధారం. సంక్షేమ పథకాల నుంచి, చిన్నారుల స్కూల్ అడ్మిషన్ వరకు ఆధార్ తప్పనిసరి అయింది. పెద్దవాళ్లయితే ఇప్పటికే ఆధార్ తీసుకొని ఉంటారు. కానీ అప్పుడే పుట్టిన పిల్లల సంగ‌తేంటి?(How to get Aadhar Card for Children) వాళ్లకు ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలి? చిన్నపిల్లల‌కు ఆధార్ కార్డు పొందాలంటే ఏం చేయాలి? ఏయే స‌ర్టిఫికెట్లు అవ‌స‌రం అవుతాయనే విష‌యాలు చాలామందికి తెలియ‌దు. అలాంటి వారి కోస‌మే ఈ వివ‌రాలు..

శిశువు పుట్టిన తొలి రోజు నుంచే ఆధార్ కార్డు పొంద‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని యూఐడీఏఐ(UIDAI) తెలిపింది. ఇందుకోసం జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం(Birth Certificate) అవ‌స‌రం. ఈ స‌ర్టిఫికెట్‌ను పిల్లలు పుట్టిన ఆస్పత్రిలోనే ఇస్తారు. కొన్ని హాస్పిట‌ల్స్ అయితే బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌తో పాటు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ద‌ర‌ఖాస్తు(Aadhar enrolment form) ప‌త్రాన్ని కూడా అందిస్తున్నాయి.

Aadhar New Rule: ఆధార్‌లో బంధుత్వాలు కనిపించవు, కేవలం కేరాఫ్ మాత్రమే ఉంటుంది, సాఫ్ట్‌వేర్‌లో కొత్త అప్‌డేట్ తీసుకువచ్చే ఆలోచనలో కేంద్రం, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

చిన్నారులకు ఆధార్‌ కోసం ఈ కింది నియమాలు పాటించాలి

  • ఐదేళ్లలోపు పిల్లల‌కు ఇచ్చే ఆధార్ కార్డును ‘బాల్ ఆధార్’(Baal Aadhar) అని పిలుస్తారు. ఇది నీలిరంగులో ఉంటుంది. న‌వ‌జాత శిశువుకు(New born baby) ఆధార్ తీసుకోవాలంటే త‌ల్లిదండ్రులు ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
  • శిశువు బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌తో పాటు త‌ల్లిదండ్రుల్లో ఒక‌రి ఆధార్ కార్డును ప్రూఫ్‌గా అందించాలి. అలాగే త‌ల్లిదండ్రుల నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం కూడా అవ‌స‌రం.
  • ఐదేళ్లలోపు పిల్లల బ‌యోమెట్రిక్ డేటా(Biometric Data)ను తీసుకోరు. ఐదేళ్లు నిండే వ‌ర‌కు పిల్లల చేతికి వేలిముద్రలు స‌రిగ్గా ఏర్పడ‌వు. కాబ‌ట్టి బ‌యోమెట్రిక్ డేటా తీసుకోవ‌డం సాధ్యం ప‌డ‌దు. అందుకే శిశువు ఆధార్‌ను త‌ల్లిదండ్రుల ఆధార్‌కు లింక్ చేస్తారు.
  • ఐదేళ్ల త‌ర్వాత ఎలా అప్లై చేయాలి

    ఐదేళ్లలోపు ఇచ్చిన ఆధార్‌కార్డు నంబ‌ర్‌లో ఎలాంటి మార్పు చేయ‌రు. కాక‌పోతే ఆధార్ వివ‌రాల అప్‌గ్రేడ్ కోసం త‌ల్లిదండ్రులు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

  • పిల్లల‌ బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌, త‌ల్లిదండ్రుల ఆధార్ కార్డుతో పాటు పిల్లల స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదా బోన‌ఫైడ్ స‌ర్టిఫికెట్‌ను ద‌ర‌ఖాస్తుతో పాటు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
  • ఈసారి పిల్లల నుంచి వేలిముద్రలు(finger prints), ఐరిష్ స్కాన్(Iris Scan) సేక‌రిస్తారు. పిల్లల‌కు 15 ఏళ్లు నిండిన త‌ర్వాత మ‌రోసారి బయోమెట్రిక్ డేటాను అప్‌గ్రేడ్ చేయించాల్సి ఉంటుంది.
  • ఎన్‌రోల్ చేసుకోవ‌డం ఎలా?

    మొద‌ట యూఐడీఏఐ వెబ్‌సైట్ (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html) ఓపెన్ చేసి గెట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి.

  • ఆ త‌ర్వాత‌ బుక్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేసి వివ‌రాలు న‌మోదు చేయాల్సి ఉంటుంది.
  • మొద‌ట చిన్నారి పేరు, త‌ల్లిదండ్రుల్లో ఒక‌రి ఫోన్ నంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీ వివ‌రాలు న‌మోదు చేయాలి.
  • వ్యక్తిగ‌త వివ‌రాల త‌ర్వాత ఇంటి అడ్రస్‌(Address)ను ద‌ర‌ఖాస్తు ఫాంలో నింపాలి. ఆ త‌ర్వాత ఫిక్స్ అపాయింట్‌మెంట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి.. బుకింగ్ తేదీ, స‌మ‌యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • అపాయింట్‌మెంట్ బుక్ అయిన త‌ర్వాత ఆ స‌మయానికి మనం ఎంచుకున్న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్ లేదా ఈ సేవ కేంద్రానికి వెళ్లాలి.
  • కావాల్సిన అన్ని డాక్యుమెంట్ల‌తో పాటు అపాయింట్‌మెంట్ లెట‌ర్ ప్రింట్ అవుట్ కూడా ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  • ఆ స‌ర్టిఫికెట్లు అన్నింటినీ వెరిఫై చేసిన త‌ర్వాత ఆ వివ‌రాల‌ను ఎన్‌రోల్ చేసుకుంటారు. పిల్లల వ‌య‌సు ఐదేళ్లు దాటితే బ‌యోమెట్రిక్ డేటాను సేక‌రిస్తారు.
  • ఎన్‌రోల్‌మెంట్ పూర్తయిన త‌ర్వాత మ‌న‌కు ఒక అక‌నాలెడ్జ్‌మెంట్ నంబ‌ర్‌ను ఇస్తారు. ఈ నంబ‌ర్ స‌హాయంతో ఆధార్ స్టేట‌స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు.
  • స‌ర్టిఫికెట్ల‌ వెరిఫికేష‌న్ పూర్తయిన త‌ర్వాత మొబైల్‌కు యూఐడీఏఐ నుంచి ఒక మెసేజ్ కూడా వ‌స్తుంది. ఆ మెసేజ్ వ‌చ్చిన 60 రోజుల‌కు ఆధార్ కార్డు ఇంటి ఆడ్రస్‌కు వ‌స్తుంది. కావాలంటే యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.