The last date of linking a Permanent Account Number (PAN) to an Aadhaar card is March 31, 2021 (Photo Credits: PTI)

New Delhi, March 30: ఈ నెల 31లోగా పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం (PAN-Aadhaar Linking) చేయకపోతే పాన్‌ కార్డు చెల్లదు. అంతే కాకుండా రూ.1000 జరిమానా పడుతుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఐటీ చట్టానికి సవరణలు చేసింది. పాన్‌కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఆధార్‌ నంబర్‌ లింక్‌ (PAN-Aadhaar Linking) చేయకపోతే జరిమానా పడుతుందా.. తిరిగి లింక్‌ చేసుకోవాలంటే జరిమానా కట్టాల్సి ఉంటుందా అన్న విషయాన్ని చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు.

దీనిపై కేంద్రం ప్రత్యేకంగా ప్రకటన జారీచేయనున్నట్టు తెలుస్తున్నది. ఆదాయ పన్ను విభాగం సైట్‌ https://www.incometaxindiaefiling.gov.in/home, NSDL, UTI వెబ్‌సైట్‌ల ద్వారా పాన్‌కార్డుతో ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేయవచ్చు.

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి ఇప్పటికే అనేక సార్లు గడువు ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. ఏకంగా 8 సార్లు చివరి తేదీలను పొడిగించింది. ఈసారి మార్చి 31 డెడ్‌లైన్ అని స్పష్టం చేసింది. ఇందులో మార్పు ఉండకపోవచ్చు. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవాళ్లలో చాలామంది తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారు. ఇంకా లింక్ చేయనివాళ్లున్నారు. అయితే తమ ఆధార్ నెంబర్ పాన్ కార్డుతో లింక్ అయిందా లేదా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

సెకండ్ వేవ్‌లో యూత్‌ని టార్గెట్ చేసిన కరోనా, 20-39 సంవత్సరాల వయస్సు వారిపై అధికంగా కోవిడ్ వైరస్ ప్రభావం, అజాగ్రత్తగా ఉంటే మొదటి వేవ్ కన్నా ఎక్కువ మరణాలు సంభవిస్తాయంటున్న బెంగుళూరు వైద్యులు

లింక్ చేయడం ఎలా ?

ముందుగా https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలో Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయండి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Link Aadhaar పైన క్లిక్ చేయాలి.

మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ వెంటనే లింక్ అవుతుంది.

ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ చేయొచ్చు. ఇందుకోసం సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి. UIDPAN<space><12 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్> అని టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ కోసం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి. రూ.50,000 కన్నా ఎక్కువ లావాదేవీలకు తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాలి.

పాన్-ఆధార్ లింక్ చేసినట్టైతే స్టేటస్ తెలుసుకోవడం ఎలా ?

ముందుగా మీరు www.incometaxindiaefiling.gov.in/aadhaarstatus ఈ లింక్‌ మీ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి. పాన్-ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకునే పేజీ ఓపెన్ అవుతుంది. PAN అని ఉన్న చోట బాక్సులో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. Aadhaar Number అని ఉన్న చోట బాక్సులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓసారి రెండు నెంబర్లు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత View Link Aadhaar Status పైన క్లిక్ చేస్తే మీరు మీ పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేశారో లేదో తెలుస్తుంది. ఆధార్ లింక్ చేసినట్టు చూపిస్తే ఇక మీరు మళ్లీ లింక్ చేయాల్సిన అవసరం లేదు.