Credits: Twitter

Tirumala, July 3: కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీవారు స్వయంగా కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో (Tirumala) వారాంతం (Weekend) సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex) కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేకుండా క్యూ లైన్లలోకి వచ్చిన భక్తులకు (Devotees) స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఒకరోజు పాటు భక్తులు క్యూ లైన్లలో ఉండాల్సి వస్తుండడంతో, టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కిచిడి, ఉప్మా, పెరుగన్నం, బిసిబేళా బాత్, పాలు, మజ్జిగ అందిస్తోంది.

Trains Cancelled: నేటి నుంచి 24 రైళ్లు రద్దు.. మరో 22 ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా.. 9వ తేదీ వరకు.. ఆపేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన.. ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

వెంకన్నకు  భారీ ఆదాయం

తిరుమల వెంకన్నకు హుండీ రూపంలో భారీ ఆదాయం లభించింది. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.27 కోట్ల ఆదాయం లభించింది. నిన్న తిరుమల శ్రీవారిని 82,999 మంది దర్శించుకున్నారు. 38,875 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు.

TSRTC Bumper Offer: టీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. 10 శాతం రాయితీతో రూ.100 వరకు ఆదా.. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణించేవారికి రాయితీ