New Delhi, Jan 2: ఇప్పటిదాకా గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ చేస్తే అవతలి వారు రిసీవ్ చేసుకోవడం తద్వారా సమయం వేస్ట కావడం లాంటివి జరుగుతుండేవి, అయితే ఇప్పుడు దీనికి ముగింపు పలుకుతూ కేవలం ఫోన్ మిస్డ్ కాల్‌తోనే ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ సదుపాయం ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరే 845455555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే రీఫిల్ సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
వినియోగదారులు ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి కాల్ ఛార్జీలు పడకుండానే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి, వృద్ధులకు, ఐవీఆర్‌ఎస్ తెలియని వారికి ఇది సహాయకారిగా ఉంటుందని పేర్కొంది.వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సౌకర్యార్థం ఈ సేవలను విస్తరించినట్టు పేర్కొంది.
కాగా ఈ సేవలు ఇప్పటికే మెట్రో సిటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మిస్డ్ కాల్ సదుపాయాన్ని ప్రారంభించారు.