New Delhi, Sep 15: దేశంలో అన్‌లాక్-4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను ప్రకటించి నడుపుతున్న భారతీయ రైల్వే కొత్తగా మరో 40 రైళ్లను (IRCTC Special Trains) ప్రకటించింది. ఈ నెల 21 నుంచి ఇవి పట్టాలెక్కనున్నాయి. వీటిలో చాలా వరకు రైళ్లు బీహార్ నుంచి రాకపోకలు సాగించనుండగా, రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్-ధన్‌పూర్ మధ్య తిరగనున్నాయి. ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నో-ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు.
తాజాగా ప్రకటించిన 40 స్పెషల్ ట్రైన్స్ 2020 సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటిని క్లోన్ స్పెషల్ ట్రైన్స్ అని రైల్వే తెలిపింది. అంటే ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుస్తున్న రూట్లలో కొన్ని రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో మాత్రమే కొత్తగా ప్రత్యేక రైళ్లను ఇండియన్ రైల్వే (Indian Railways) ప్రకటించింది .
రైలు నెంబర్ 02787 సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ప్రతీ రోజూ ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. ఇక రైలు నెంబర్ 02788 దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 06509 బెంగళూరు నుంచి దానాపూర్ ఉదయం 8 గంటలకు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 06510 దానాపూర్ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బెంగళూరు బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు విజయవాడ, వరంగల్ విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
Here's Trains List
Considering the huge demand for travel on specific routes, Ministry of Railways has decided to run 20 pairs of Clone Special trains from 21.09.2020.
These Clone trains will run on notified timings. ARP for these trains will be 10 days.https://t.co/wTHauZw2IB pic.twitter.com/TlUrSmtCdW
— Ministry of Railways (@RailMinIndia) September 15, 2020
దేశంలో కరోనావైరస్ లాక్డౌన్ (COVID-19 lockdown) పాక్షికంగా ఎత్తివేయబడిన తరువాత, జాతీయ రవాణాదారు అయిన ఇండియన్ రైల్వే మేలో 30 ఎసి ఐఆర్సిటిసి ప్రత్యేక రైళ్లను నడపడం ప్రారంభించింది, తరువాత జూన్లో అదనంగా 200 రైళ్లు వచ్చాయి. మరో 80 ఐఆర్‌సిటిసి ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 12 నుండి పనిచేయడం ప్రారంభించాయి, ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం రైళ్ల సంఖ్య 310 కి చేరుకుంది. ఈ 20 క్లోన్ రైళ్లను చేర్చడంతో, రైల్వేలు కోవిడ్ పూర్వ స్థాయికి తిరిగి రావడానికి మరో ప్రధాన అడుగు వేస్తాయని పలువురు అంటున్నారు.