IRCTC (Photo-ANI)

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్తను అందించింది. ఇకపై రిజర్వేషన్‌ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది. ఐఆర్‌సీటీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారందరికీ ఈ బీమా సౌకర్యం కలుగుతుంది.

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నేడు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం

రైలు ప్రమాదాల్లో జరిగే మరణం, అంగవైకల్యం, వైద్య ఖర్చులను ఈ పాలసీ కవర్‌ చేస్తుంది. ప్రయాణికుడి నుంచి 35 పైసలు మాత్రమే ప్రీమియంగా వసూలు చేస్తారు. తమకు బీమా సౌకర్యం వద్దనుకునేవారు బుకింగ్‌ సమయంలో ఆ మేరకు ఆప్షన్‌ బటన్‌ నొక్కితే సరిపోతుంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.