Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఏమేమి ఉన్నాయి, ప్రస్తుతం ఆ పథకాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ పథకంలో చేరితే ప్రయోజనకరం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకుల వడ్డీరేట్ల సమాచారం ఇక్కడ తెలుసుకోండి
Small Savings Schemes : File Photo

Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలు దీర్ఘకాలంలో గొప్ప ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇవి దేశంలోని వివిధ వర్గాల ప్రజలు తమ ఆదాయంలోని కొంత భాగాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసే సాధనాలు. వీటిపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.   2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గానూ చిన్నమొత్తాల పొదుపు పథకాలకు వర్తించే వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు తమ ప్రకటనలో పేర్కొంది. "2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఏప్రిల్ 1, 2024 నుండి ప్రారంభమై జూన్ 30, 2024తో ముగుస్తాయి అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన మెమోరాండంలో నివేదించారు.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI ) మే 2022 నుండి కీలక వడ్డీ రేట్లను వరుసగా పెంచుతూ వచ్చింది. పర్యవసానంగా, బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్ల పెంపుదలను అమలు చేశాయి. ఆ తర్వాత కొంతకాలంగా వడ్డీరేట్లను పెంచడం గానీ, తగ్గించడం గానీ చేయకుండా యధాతథంగా కొనసాగిస్తూ వస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికం వరకు అనగా మార్చి 31 వరకు మార్చలేదు, ఇదే యధాత స్థితిని 2024 జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు తమ ప్రకటనలో స్పష్టం చేశారు.

చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు

ఏప్రిల్ నుంచి జూన్ 2024 వరకు నాల్గవ త్రైమాసికానికి తాజా వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

సేవింగ్స్ డిపాజిట్: 4 శాతం

1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 6.9 శాతం

2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.0 శాతం

3-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.1 శాతం

5-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.5 శాతం

5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు: 6.7 శాతం

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (NSC): 7.7 శాతం

కిసాన్ వికాస్ పత్రం: 7.5 శాతం (115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: 7.1 శాతం

సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం

నెలవారీ ఆదాయ ఖాతా: 7.4 శాతం.

బ్యాంక్ FD పై వడ్డీ రేట్లు

ప్రస్తుతం దేశంలో ప్రధాన బ్యాంకులు అన్నీ పొదుపుదారుడి వయసు అలాగే పొదుపు మొత్తం కాలపరిమితి ఆధారంగా 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి, అయితే కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలకు 8.2 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి.

HDFC బ్యాంక్ FD పై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఏటా 7.60 శాతం వరకు ఎఫ్‌డి రేట్లను అందిస్తోంది మరోవైపు ఎస్‌బిఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తోంది.

చిన్న పొదుపు పథకాలు ఏమిటి?

చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రతీ ఆర్థిక సంవత్సరంలోని మూడు నెలల త్రైమాసికం ప్రాతిపదికన సర్దుబాటు చేస్తారు. ఈ రేట్లను నిర్ణయించే పద్ధతిని శ్యామలా గోపీనాథ్ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ సిఫార్సుల ప్రకారం, వివిధ పథకాల వడ్డీ రేట్లు సంబంధిత మెచ్యూరిటీలతో ప్రభుత్వ బాండ్ల రాబడుల కంటే 25 నుండి 100 బేసిస్ పాయింట్ల వరకు ఉండాలి.

చిన్న మొత్తాల పొదుపు పథకాలలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (NSC), కిసాన్ వికాస్ పత్రం (KVP), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ మొదలైనవి వర్గీకరించబడ్డాయి. ఈ పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షించబడతాయి.