Larsen & Toubro. (Photo credits: Twitter)

నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది పైచిలుకు ఇంజినీరింగ్‌ ట్రెయినీలను తీసుకున్నట్లు వెల్లడించింది. వీరిలో తాజా గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్‌ చేసుకున్న 1,067 మందితో పోలిస్తే ఈసారి ట్రెయినీల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. మహిళా ఇంజినీర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 248 నుండి 1,009కి చేరినట్లు ఎల్‌అండ్‌టీ తెలిపింది. మొ­త్తం సిబ్బందిలో ప్రస్తుతం మహిళా ఉద్యోగుల వాటా 7.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మరింత మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది.

గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్, 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో కంపెనీ, పేలవమైన పనితీరు ప్రదర్శించే వారిని బయటకు పంపే ప్రయత్నం

ప్రస్తుతం ఉన్న తాజా ఇంజనీర్లలో 30% మంది మహిళలు ఉండటం గమనించదగ్గ విషయం, మహిళా అభ్యర్థులు తక్కువగా ఉన్న మెకానికల్, సివిల్ మరియు ఎలక్ట్రికల్ స్ట్రీమ్‌ల నుండి 75% తాజా ఇంజనీర్లను నియమించడం అభినందనీయం. ప్రస్తుతం, L&Tలో మొత్తం శ్రామికశక్తిలో 7.6% మహిళా ఉద్యోగులు ఉన్నారు మరియు వారు ఇప్పటికే పురుషుల కోటలుగా పరిగణించబడుతున్న రంగాలలో విజయవంతంగా ప్రవేశించారు, ”అని ఎగ్జిక్యూటివ్ VP & హెడ్, కార్పొరేట్ హ్యూమన్ రిసోర్స్, C. జయకుమార్ తెలిపారు.