పీఎఫ్​ ఖాతాదారులకు అలర్ట్​. ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ కొత్త రూల్స్ (PF Account Holders Alert)​ కూడా అమలులోకి రానున్నాయి. పీఎఫ్​ ఖాతాల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పీఎఫ్ ఖాతాలో అధికంగా జమ చేసేవారిపై పన్ను విధించి ఉద్దేశంతో ఈ మార్పులను (New rules to come from April 1) తీసుకురానుంది ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్పులను నోటిఫై చేసింది. ఇందులో భాగంగా పీఎఫ్​ ఖాతాలను రెండుగా విభజించనుంది. అందులో ఒకటి పన్ను వర్తించేది కాగా.. రెండోది పన్ను మినహాయింపు ఉండేది.

2021 బ‌డ్జెట్ ముందు వ‌ర‌కు ఈపీఎఫ్‌పై వ‌చ్చే వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను రాయితీ ఉంది. కానీ గ‌తేడాది ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కొత్త ప్ర‌తిపాద‌న తీసుకొచ్చారు. ప్ర‌తియేటా పీఎఫ్ ఖాతా రూ.2.5 ల‌క్ష‌లు దాటితే ప‌న్ను విధిస్తామ‌ని తెలిపారు. ఉద్యోగుల పీఎఫ్ మొత్తంపై ఎలా ప‌న్ను విధిస్తార‌న్న విష‌య‌మై కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త రూల్స్‌ను నోటిఫై చేసింది.

ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, రాష్ట్రాన్ని బట్టి సెలవుల్లో మార్పు, ఏప్రిల్ నెల బ్యాంకు సెలవులు పూర్తి జాబితా ఇదే..!

గ‌తేడాది ఆగ‌స్టు 31న సీబీడీటీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. రూ.2.5 ల‌క్ష‌ల‌కు పైగా కంట్రిబ్యూష‌న్ ఉంటే ప‌న్ను విధిస్తారు. పీఎఫ్ ఖాతాలో యాజ‌మాన్యాల కంట్రిబ్యూష‌న్ లేక‌పోతే రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లిమిట్ పెంచారు. ప్ర‌తి సంస్థ య‌జ‌మాని త‌మ సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగి క‌నీస వేత‌నంలో 12 శాతం ప్ల‌స్ డీఏను ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ చేస్తారు. ప్ర‌తి నెలా ఉద్యోగి వేత‌నం నుంచి 12 శాతం కోత విధించి పీఎఫ్ ఖాతాకు త‌ర‌లిస్తారు. ఇందులో 8.33 యాజ‌మాన్యం కంట్రిబ్యూష‌న్‌ను ఉద్యోగుల పెన్ష‌న్ ప‌థ‌కం (ఈపీఎస్‌)కు మ‌ళ్లిస్తారు. ఈపీఎస్‌కు మ‌ళ్లించిన మొత్తంపై వ‌డ్డీ ఆదాయం ఉండ‌దు.

ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పీఎఫ్‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం మీద పూర్తిగా ప‌న్ను రాయితీ ఉంటుంది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ప్ర‌తియేటా వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను విధిస్తారు. రూ.2.5 ల‌క్ష‌ల్లోపు, రూ.2.5 ల‌క్ష‌ల పైచిలుకు కంట్రిబ్యూష‌న్ గ‌ల పీఎఫ్ ఖాతాల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం ఆధారంగా విడ‌దీస్తారు.2022 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి కొత్త పీఎఫ్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలో 9డీ సెక్ష‌న్ కొత్త‌గా చేర్చారు. దీని ప్ర‌కారం రూ.2.5 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగుల కంట్రిబ్యూష‌న్‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై నూత‌న ప‌న్ను వ‌సూలు చేస్తారు

.