Jobs. (Representational Image | File)

భారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్‌ఈసీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, ఆఫీసర్‌, త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి మార్చి 15న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ గ‌డువు ఎల్లుండితో ముగియ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌, బీఈ, డిప్లొమా సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 21 ఏండ్ల‌ పని అనుభవం ఉండాలి.

పరీక్షలు లేకుండానే ఎయిర్‌పోర్టులో జాబ్స్, రూ. 23 వేల వేతనంతో నిరుద్యోగులను ఆహ్వానిస్తున్న ఎయిర్ ఇండియా, పూర్తి వివరాలు ఇవిగో..

మొత్తం పోస్టులు : 125

పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, ఆఫీసర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌ తదితరాలు.

విభాగాలు: అడ్మిన్‌, సీసీ, లా, సెక్రటేరియల్‌, రాజ్‌భాష, సీఎస్‌, ఐటీ, హెచ్‌ఆర్‌ తదితరాలు.

అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌, బీఈ, డిప్లొమా సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 21 ఏండ్ల‌ పని అనుభవం ఉండాలి.

వయస్సు : 33 నుంచి 55 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మిన‌హాయింపు ఉంటుంది).

జీతం : ఏటా రూ.7లక్షలు-రూ.26లక్షలు

ఎంపిక : రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

చివరి తేది: ఏప్రిల్ 15

వెబ్‌సైట్ : https://recindia.nic.in/