Bengaluru, January 21:  క‌రోనా (Corona)విజృంభించిన‌ప్ప‌టికీ అత్య‌ధికంగా వినియోగంలో ఉన్న మెడిసిన్ ఏదైనా ఉందా? అంటే.. అది కేవ‌లం డోలో 650(Dolo 650) అని చెప్పొచ్చు. సాధారణంగా జ్వ‌రం వ‌చ్చినా, ఒళ్లు నొప్పుల(Body pains)తో పాటు చ‌లి జ్వ‌రం(Fever) వ‌చ్చినా వెంట‌నే డోలో 650 వేసుకుంటాం. దీంతో కాస్త రిలీఫ్ ఉంటుంది.

అయితే జ్వ‌రం రావ‌డం, బాడీ పెయిన్స్ తో పాటు జ‌లుబు(Cold) ఉంటే క‌రోనా ల‌క్ష‌ణాలుగా గుర్తించారు. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న వారు మొద‌ట‌గా డోలో 650 మెడిసిన్‌(Dolo 650)నే ఉప‌యోగించారు. ఆ మెడిసిన్ వాడ‌కంతో చాలా మంది క‌రోనా(Corona) నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెప్పొచ్చు. కొవిడ్ 19 రోగుల‌కు ఫీవ‌ర్ మెడిసిన్‌గా డోలో 650 వాడాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు.

Coronavirus in India: మూడు లక్షలు దాటిన డైలీ కరోనా కేసులు, తగ్గినట్లే తగ్గి...విజృంభిస్తున్న మహహ్మారి, పదివేలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు

కొవిడ్ నివార‌ణ‌కు ప్ర‌ధానంగా ఉప‌యోగించిన డోలో 650 మెడిసిన్ ఈ రెండేండ్ల కాలంలో రికార్డు సృష్టించింది. మార్చి 2020 నుంచి నేటి వ‌ర‌కు 350 కోట్ల‌కు పైగా డోలో 650 పిల్స్ వినియోగించిన‌ట్లు తేలింది. కొవిడ్ కాలంలో బెంగ‌ళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ (Micro Labs Limited)దాదాపు 7.5 కోట్ల డోలో స్ట్రిప్స్‌ను అమ్మిన‌ట్లు హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ IQVIA వెల్ల‌డించింది.

అయితే డోలో 650 మెడిసిన్ 2021లో రూ. 307 కోట్ల ట‌ర్నోవ‌ర్‌ను న‌మోదు చేసిన‌ట్లు డాటాలో స్ప‌ష్ట‌మైంది. ఇక జీఎస్‌కే ఫార్మా కంపెనీ కాల్‌పూల్ మెడిసిన్‌ను విక్ర‌యించి రూ. 310 కోట్ల ట‌ర్నోవ‌ర్‌ను న‌మోదు చేయ‌గా, క్రొసిన్ ట్యాబ్లెట్‌ను అమ్మి రూ. 23.6 కోట్ల ట‌ర్నోవ‌ర్‌ను న‌మోదు చేసింది.