Passengers at platform | (Photo Credits: Getty Images)

Hyderabad, May 2: దేశంలో కరోనా కల్లోలం రైళ్లపై పడింది. జనాలు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చే సాహసం చేయకపోవడం..ప్రయాణాలు లాంటివి పెట్టుకోకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 23 రైళ్లను తాత్కాలికంగా రద్దు (South Central Railway cancels 25 trains) చేయగా, మరో రెండింటిని పాక్షికంగా రద్దు చేసింది. కోవిడ్‌ దృష్ట్యా గతకొద్ది రోజులుగా రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ చాలావరకు పడిపోయింది. దీంతో డిమాండ్‌ ఉన్న రూట్లలోనే నడుపుతున్నారు.

ఔరంగాబాద్‌–నాందేడ్, ఆదిలాబాద్‌–నాందేడ్, వికారాబాద్‌–గుంటూరు, సికింద్రాబాద్‌–యశ్వంత్‌పూర్, తిరుపతి–మన్నార్‌గుడి, రేపల్లె–కాచి గూడ, గుంటూరు–కాచిగూడ, సికింద్రాబాద్‌–సాయినగర్‌ షిరిడి, చెన్నై సెంట్రల్‌–తిరుపతి, సికింద్రాబాద్‌–విశాఖపట్టణం, ఔరంగాబాద్‌– రేణిగుంట, పర్బనీ–నాందేడ్‌ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను ఆదివారం నుంచి జూన్‌ 2 వరకు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. నాందేడ్‌–తాండూరు–పర్బనీ మధ్య నడిచే 2 సర్వీసులను ఈనెల 31 వరకు సికింద్రాబాద్‌–తాండూరు మధ్య నడుపుతారు.

నేటి నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా ప్రభుత్వం, కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించిన సీఎం నవీన్ పట్నాయక్

కాగా కరోనా తీవ్రత తగ్గి, ప్రయాణికుల ఆదరణ పెరిగితే వీటిని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. దీంతో ఈ వారం రోజుల్లో రద్దయిన రైళ్ల సంఖ్య 35కు చేరింది. ఇవన్నీ ఏప్రిల్‌ నెలలో పునరుద్ధరించిన ప్రత్యేక రైళ్లే. ఈ నెల 2, 3, 4, 7, 8, 10 తేదీల్లో నడవాల్సిన ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

రద్దయిన రైళ్ల వివరాలు

ఔరంగాబాద్‌-నాందెడ్‌, నాందెడ్‌-ఔరంగాబాద్‌, ఆదిలాబాద్‌-నాందెడ్‌, నాందెడ్‌-ఆదిలాబాద్‌, వికారాబాద్‌-గుంటూరు, గుంటూరు- వికారాబాద్‌, సికింద్రాబాద్‌- యశ్వంత్‌పూర్‌, యశ్వంత్‌పూర్‌- సికింద్రాబాద్‌, తిరుపతి-మన్నార్‌గుడి, మన్నార్‌గుడి- తిరుపతి, రేపల్లె-కాచిగూడ, కాచిగూడ-రేపల్లె, కాచిగూడ-గుంటూరు, గుంటూరు-కాచిగూడ, సికింద్రాబాద్‌- షిర్డీ, షిర్డీ-సికింద్రాబాద్‌, తిరుపతి-చెన్నై సెంట్రల్‌, చెన్నై సెంట్రల్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్‌, ఔరంగాబాద్‌-రేణిగుంట, రేణిగుంట-ఔరంగాబాద్‌, పర్బని-నాందెడ్‌. ఇక 2న బయలుదేరాల్సిన నాందెడ్‌-తాండూరు ట్రెయిన్‌ను సికింద్రాబాద్‌ వరకే పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. 3న బయలుదేరాల్సిన తాండూరు-పర్బని ట్రెయిన్‌ను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించింది.