Hyderabad, Sep 24: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వర్షాలు (Rains) కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలు తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి అల్పపీడనంగా మారాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఈ రోజు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నట్టు వెల్లడించారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.