Hyderabad, June 26: తెలంగాణలో (Telangana) ఎంసెట్-2023 (EAMCET-2023) ప్రవేశాల కౌన్సెలింగ్ (EAMCET Counselling) నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నేటి నుంచి జులై 5 (July 5) వరకు రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ (Slot Booking) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చు. ప్రవేశాలు, కోర్సులు, సీట్ల వివరాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ, నోటిఫికేషన్, సహాయ కేంద్రాల సమాచారాన్ని https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది.
TS EAMCET 2023 Counselling: Registration begins June 26, here’s how to applyhttps://t.co/ubKYX22nw3 pic.twitter.com/gyzI3EbZKt
— Hindustan Times (@htTweets) June 24, 2023
పాలిటెక్నిక్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. మొత్తం 116 కళాశాలల్లో 29,396 సీట్లకు గాను 21,367 సీట్లను భర్తీ చేశారు. ఎన్‌సీసీ, క్రీడల కోటా సీట్లను తుది విడత కౌన్సెలింగ్ అనంతరం కేటాయిస్తామని సీట్లు పొందిన విద్యార్థులు జులై 7 నుంచి 10 వరకు తమ కేటాయించిన కళాశాలల్లో చేరాలని, చేరని వారి సీట్లను రద్దుచేస్తామని తెలిపారు. కళాశాలల్లో జులై 7 నుంచి 14 వరకు పునశ్చరణ జరుగుతుందని, 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.