Representational Picture. Credits: PTI

Hyd, May 10: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,370 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 9 మంది విద్యార్థుల తెలుగు పరీక్ష జవాబు పత్రాల బండిల్ కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుని వారిని పాస్ చేసినట్టు సమాచారం. కాగా, విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్, తెలంగాణలో ఒక్కరోజే 8 మంది విద్యార్థులు ఆత్మహత్య, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన స్టూడెంట్స్

నిన్నటి ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరం రెండింటిలోనూ బాలురను మించి ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్‌ కావడం గమనార్హం.

ఇంటర్‌ రెండేళ్ల పరీక్షలు కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారని తెలిపారు.ఫస్టియర్‌లో 61.68 శాతం, సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 1,75,505 మంది, సెకండియర్‌లో 1,91,698 మంది ఏ గ్రేడ్‌ (75శాతంపైన మార్కులతో)లో ఉత్తీర్ణులైనట్టు వివరించారు. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ (75% పాస్‌) మొదటి స్థానంలో, రంగారెడ్డి (73% పాస్‌) ద్వితీయ స్థానంలో నిలిచా యని మంత్రి తెలిపారు. సెకండియర్‌లో ములుగు (85% పాస్‌) మొదటి స్థానంలో, కొమురం భీం (81 శాతం పాస్‌) రెండో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేశారు.