Section 80C Benefit: సెక్షన్ 80సీ పై త్వరలోనే గుడ్ న్యూస్..? పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం, ఈ సారి వేతనజీవులకు ఊరట లభించే అవకాశం, పరిమితి పెంచితే వచ్చే లాభాలేంటి? కేంద్రం ఆలోచన ఎలా ఉంది?
Odisha daily wage labourer gets I-T notice for Rs 1.47 cr transaction(Photo-IANS)

New Delhi January 18: వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సర‌ (2022-23) బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌లు (Budget) సిద్ధం అవుతున్నాయి. వ‌చ్చేనెల ఒక‌టో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ (Nirmala sitaraman) పార్లమెంట్‌కు బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌లు స‌మ‌ర్పించ‌నున్నారు. అయితే, ప్రతి బ‌డ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా వేత‌న జీవులు ప‌న్ను మిన‌హాయింపుల (tax saving deduction) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కుముందు ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఆదా మార్గం.. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీ సెక్షన్(section 80C) ఉండేది. 2013-14 వ‌ర‌కు ప్రతియేటా గ‌రిష్ఠంగా రూ.ల‌క్ష వ‌ర‌కు మాత్రమే. 2014-15లో దాని ప‌రిమితి రూ.1.5 ల‌క్షల‌కు పెంచేశారు. నాటి నుంచి ఏడేండ్లుగా ఇదే ప‌రిమితి కొన‌సాగుతున్నది. వ‌చ్చే బ‌డ్జెట్(Union Budget) ప్రతిపాద‌న‌ల్లోనైనా దీన్ని రూ.2.5 ల‌క్షల‌కు పెంచాల‌న్న అభ్యర్థన‌లు వినిపిస్తున్నాయి.

2014-15 నుంచి ప‌లు ఖ‌ర్చులు పెరిగాయి.. వేత‌న జీవుల వేత‌నాలు.. అల‌వెన్స్‌లు పెరిగాయి. వాటితోపాటు నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెరిగాయి. కానీ ఇన్‌కం టాక్స్ యాక్ట్‌ (Income Tax Act)లో 80సీ సెక్షన్ కింద బెనిఫిట్ మాత్రం పెంచ‌లేదు. ఈ నేప‌థ్యంలో 80సీ సెక్షన్ కింద ఆదా ప‌రిమితులు పెంచాలని ప్రతియేటా ప‌లు వ‌ర్గాలు ప్రభుత్వాన్ని.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌ను అభ్యర్థిస్తూనే ఉన్నాయి కూడా..

ప్రస్తుతం కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ఎఫెక్ట్‌ (Corona effect), దాని ప్రభావంతో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 80సీ సెక్షన్ (Section 80c ) కింద ఏటా ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని రూ.2.5 ల‌క్షల‌కు పెంచాల‌న్న డిమాండ్ వ‌స్తున్నది. ఇది కేవ‌లం స‌గ‌టు ప‌న్ను చెల్లింపుదారుడిపై భారాన్ని త‌గ్గించ‌డ‌మే కాదు.. ప్రభుత్వానికి సాయ ప‌డుతుంది.

80సీ సెక్షన్ కింద అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. గతంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF) మాత్రమే 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు కోరేవి. ప‌న్ను ఆదాకు అత్యంత ప్రజాద‌ర‌ణ పొందిన సెక్షన్ ఇది. వ్యక్తులు కొన్ని పొదుపు ప‌థ‌కాల కింద ఇన్వెస్ట్‌మెంట్లు, కొన్ని ప్రత్యేక‌మైన ఖర్చుల‌కు మిన‌హాయింపు కోర‌తారు. దీని ద్వారా ఒక‌టి కంటే ఎక్కువ పొదుపు ప‌థ‌కాల కింద గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్షల వ‌ర‌కు ప‌న్ను పొదుపు చేయొచ్చు.

80సీ సెక్షన్ కింద పన్ను డిడక్షన్ మార్గాలు చాలా ఉన్నాయి. దీని ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు, ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌లో కంట్రిబ్యూష‌న్‌, ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్‌, వాలంట‌రీ ప్రావిడెండ్ ఫండ్‌లో కంట్రిబ్యూష‌న్స్‌, ఇంటి రుణంపై ప్రిన్సిప‌ల్ అమౌంట్ రీపేమెంట్‌, ఇల్లు కొనుగోలు కోసం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేష‌న్ చార్జీల చెల్లింపు, ఈఎల్ఎస్ఎస్(ELSS) లేదా టాక్స్ సేవింగ్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు, సుకన్య స‌మృద్ధి ఖాతా (Sukanya samridi account)లో పెట్టుబ‌డులు పిల్లల విద్యా సంస్థల ట్యూష‌న్ ఫీజు చెల్లింపులు, పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా ఐదేండ్ల టాక్స్ సేవింగ్స్ బ్యాంకులో ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేయవచ్చు.

హౌస్ హోల్డ్ సేవింగ్స్‌కు ప్రోత్సాహం.. ద్రవ్యోల్బణ నియంత్రణ‌ కోసం పరిమితి పెంచాల్సి ఉంటుంది. దీనిద్వారా మౌలిక వ‌స‌తుల రంగానికి దీర్ఘకాలిక నిధులు స‌మ‌కూర్చే వెసులుబాటు ల‌భిస్తుంది. అంతేకాదు ప్రభుత్వానికి త‌క్కువ ఖ‌ర్చుతో నిధుల ల‌భ్యత‌ ఉంటుంది. భారీగా ఉపాధి క‌ల్పించే గృహ నిర్మాణ రంగ ప‌రిశ్రమ వృద్ధికి దోహదపడుతుంది. సుక‌న్య స‌మృద్ధి స్కీం కింద బాలికా విద్య, వివాహాలు త‌దిత‌ర సామాజిక ల‌క్ష్యాల సాధ‌న‌కు చేయూత‌ లభిస్తుంది.

ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని 2014-15లో రూ.1.5 ల‌క్షల‌కు పెంచేసింది కేంద్రం. కానీ నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు రోజురోజుకు జీవ‌న వ్యయం పెరిగిపోతూ వ‌చ్చింది. మ‌హ‌మ్మారి వ‌చ్చిన త‌ర్వాత అది మ‌రింత పెరిగింది. క‌నుక 80సీ సెక్షన్ కింద రూ.1.5 ల‌క్షల వ‌ర‌కు ప‌న్ను డిడ‌క్షన్ ప‌రిమితిని వ‌చ్చే ఏడాదికి స‌మ‌ర్పించే బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌ల్లోనైనా రూ.2.5 ల‌క్షల‌కు పెంచాల‌న్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. దీనివ‌ల్ల ప్రతి ఒక్క ప‌న్ను చెల్లింపుదారు ఈజ్ ఆఫ్ లివింగ్‌కు సాయ ప‌డుతుంది.

80సీ కింద పన్ను మినహాయింపుతో వ్యక్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుల ప‌న్ను భారం త‌గ్గుతుంది. దాంతో పాటూ రిటైర్‌మెంట్‌, పిల్లల విద్య త‌దిత‌ర అవ‌స‌రాలు, ఇల్లు కొనుగోలుకు పెట్టుబ‌డి టాక్స్ పేయ‌ర్లకు సెక్యూరిటీ క‌ల్పన లభిస్తుంది.