New Delhi, July 29: గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఐటీ రిటర్న్స్ దాఖలు (filing ITR) చేయడానికి చివరి తేదీ జూలై 31. రూ.2.5 లక్షల పై చిలుకు ఆదాయం గల వేతన జీవులు(Salaried employees), పన్ను చెల్లింపు దారులు గడువులోగా ఐటీఆర్ (ITR) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో పెనాల్టీలు(penalty), ఫైన్‌లు చెల్లించడం అదనపు భారంగా మారనున్నది. ఆదాయం పన్ను చట్టం-1961లోని 234ఎఫ్ సెక్షన్ కింద ఖరారు చేసిన పెనాల్టీలు, ఫైన్‌లను ఆదాయం పన్ను విభాగం (ఐటీ డిపార్ట్‌మెంట్ I-T department) ఖరారు చేస్తుంది. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి పన్ను మినహాయింపులు, డిడక్షన్లు క్లయిమ్ (Deduction clime) చేయడానికే ఐటీఆర్‌లు సాధారణంగా దాఖలు చేస్తారు. అయినా ఐటీఆర్ (ITR) దాఖలు చేయడంతో బెనిఫిట్లు దీనికే పరిమితం కాలేదు. ఐటీ ఫైలింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తెలియక చాలామంది ఐటీ ఫైలింగ్ ను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఐటీ ఫైలింగ్ వల్ల ఉన్న టాప్ 5 ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా?
ఫైన్‌లు, పెనాల్టీల సుంచి సేఫ్టీ (Safety from fines)
ఒకవేళ గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకుంటే మీపై ఆదాయం పన్ను విభాగం ఫైన్ లేదా పెనాల్టీ విధించొచ్చు. ఒక్కోసారి మూడేండ్ల నుంచి ఏడేండ్ల వరకు జైలుశిక్ష కూడా విధించొచ్చు. అంతే కాదు.. ఐటీఆర్‌లు సబ్మిట్ చేయడం ఆలస్యమైతే రూ.5 లక్షలకు పైగా ఆదాయం గల వారు రూ.5000, రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
రుణాలు తేలిక (Easy loans)
ఒకవేళ మీరు ఏదైనా రుణం కావాలంటే.. చాలా బ్యాంకులు ఇప్పుడు ఐటీఆర్ ప్రతులు సమర్పించాలని కోరుతున్నాయి. రుణ గ్రహీతగా మీ ఆర్థిక హోదా, సామర్థ్యాన్ని ఖరారు చేయడంలో ఐటీ రిటర్న్స్ కీలకం అవుతాయి. ఒకవేళ ఐటీ రిటర్న్స్ సిద్ధంగా ఉంటే, రుణాల ప్రక్రియ వేగంగా ప్రాసెస్ అవుతుంది.
వేగంగా వీసా ప్రాసెస్ (Visa process)
రుణాలతోపాటు విదేశాలకు వెళ్లే వారికి వీసా ప్రాసెస్ చేపట్టాలంటే సంబంధిత దేశానికి చెందిన ఎంబసీ అధికారులు ఐటీఆర్‌లు సబ్మిట్ చేయమని అడుగుతారు. తాజా ఐటీఆర్ పత్రాలు సమర్పిస్తే వీసా అప్లికేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
ఫ్రీలాన్సర్లకు సేఫ్టీ (Safety for freelancer)
ఫ్రీలాన్సర్ల వద్ద ఫామ్-16 ఉండదు. వారి వద్ద కేవలం తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రంగా ఐటీఆర్ మాత్రమే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు ఐటీఆర్ సాయ పడుతుంది.
అధిక ఆరోగ్య బీమా కవరేజీ (Health Insurgence coverage)
పన్ను చెల్లింపుదారులకు మాత్రమే పలు కంపెనీలు భారీ ప్యాకేజీతో కూడి ఆరోగ్య బీమా కవరేజీ కల్పించడానికి ముందుకు వస్తాయి. ఒకవేళ పన్ను ఎగవేత దారైతే.. బ్యాంకులు ఆ వ్యక్తికి రుణాలు ఇవ్వాలా.. వద్దా.. నిర్ణయిస్తాయి.