Income Tax Department | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, June 24: 2018-19 సంవత్సరపు ఆదాయపు పన్ను వివరాలను దాఖలు చేయడానికి గడువును పొడిగించారు. ఆదాయ పన్ను పత్రాల దాఖలకు గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT నిర్ణయం తీసుకుంది. అదే విధంగా 2019-20 సంవత్సరానికి ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేసేందుకు గడువును ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.

కోవిడ్-19 నేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువును పెంచినట్లు ఇన్ కాం టాక్స్ అధికారులు తెలిపారు. అదే విధంగా లక్ష రూపాయల వరకు పన్ను చెల్లించే చిన్న, మధ్య తరగతి చెల్లింపు దారులకు కూడా గడువును ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించడం గమనార్హం.

Here's the update:

ఆధార్ నెంబరును, PAN తో లింక్ చేసే గడువును కూడా వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లు CBDT పేర్కొంది