Hyderabad, June 14: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని శరవేగంగా షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ అడవులతో పాటు, రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి ఈ సినిమా షూటింగ్ చేశారు. మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప (Kannappa) సినిమాలో మధుబాల, ప్రభాస్ (Prabhas), నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే కన్నప్ప సినిమా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. ఆల్రెడీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప సినిమా టీజర్ ప్లే చేశారు. తాజాగా కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
అలాగే టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. దీంతో ఈ టీజర్ లోని కొన్ని షాట్స్ వైరల్ అవుతున్నాయి. కన్నప్ప సినిమాలో శివుడు కచ్చితంగా ఉంటాడని తెలిసిందే. దీంతో కన్నప్పలో ప్రభాస్ శివుడుగా నటిస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చూపించిన టీజర్ ప్రకారం అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడిగా నటించినట్టు తెలుస్తుంది. అలాగే టీజర్ లో ప్రభాస్ కళ్ళని చూపిస్తూ ఓ షాట్ వేశారు. ఇక కన్నప్పని ఓ వీరుడిగా చూపిస్తు యుద్ధ సన్నివేశాలతో టీజర్ ని అదరగొట్టేసారు.