కాజీపేటలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కుమారుడు అతివేగంగా నడుపుతున్న కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భర్తతో కలిసి ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన మహిళ గురువారం హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణంలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ శుక్రవారం వైరల్‌గా మారింది. మహిళ తన భర్త ద్విచక్ర వాహనంపై కూర్చోబోతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షేర్ చేశారు. తన పోస్టులో ఓ యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. తల్లిదండ్రుల్లారా..! మీ పిల్లల సంతోషం, సరదా కోసం వారికి వాహనాలను ఇవ్వొద్దు. పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోకముందే వారికి వాహనాలను ఇస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. వాహనాల విషయంలో పిల్లల మీద అతి ప్రేమ పనికి రాదు. వారి నిర్లక్ష్యం, అజాగ్రత్త అమాయకుల ప్రాణాలను ఇలా బలి తీసుకుంటుంది.... జాగ్రత్త! అని పేర్కొన్నారు.
ఓ యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన అత్యంత దురదృష్టకరం.
తల్లిదండ్రుల్లారా..! మీ పిల్లల సంతోషం, సరదా కోసం వారికి వాహనాలను ఇవ్వొద్దు. పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోకముందే వారికి వాహనాలను ఇస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. వాహనాల విషయంలో పిల్లల మీద అతి ప్రేమ… pic.twitter.com/2Cet1zdJ3P
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 2, 2023