Maharashtra politics Shiv Sena MLAs moved to resorts (Photo-ANI)

Mumbai, November 25: ఇంమహారాష్ట్ర రాజకీయాల(Maharashtra politics)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. రేపు బిజేపీ తమ బలాన్ని నిరూపించుకోనున్ననేపథ్యంలో మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను చేజారిపోనీకుండా సీక్రెట్ ప్రదేశాలకు( (Shiv Sena MLAs moved to resorts) తరలిస్తున్నాయి. దులో భాగంగా ఇప్పుడు మహాలో రిసార్ట్ పాలిటిక్స్ మొదలయ్యాయి. బ‌ల‌నిరూప‌ణ కోసం బీజేపీ సిద్ద‌మైనా.. ఎన్సీపీ-శివ‌సేన కూట‌మి కూడా ఫ్లోర్ టెస్టుకు రెఢీ అంటోంది.

ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర కేసు సుప్రీంలో ఉన్న‌ది. శివ‌సేన పార్టీ త‌మ ఎమ్మెల్యేల‌ను ప‌దిలంగా ఉంచుకునేందుకు హోట‌ళ్లు, రిసార్ట్‌ల‌ను బుక్ చేసుకున్న‌ది. ముంబైలోని లెమ‌న్ ట్రీ హోట‌ల్‌తో పాటు ఓ ప్రైవేటు రిసార్ట్‌ను శివ‌సేన ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

బ‌ల‌ప‌రీక్ష జ‌రిగే వ‌ర‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అక్క‌డే ఉండ‌నున్నారు.విధాన భ‌వ‌న్‌లో 162 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేఖ‌ను ఇచ్చిన‌ట్లు శివ‌సేన (Shiv Sena) శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏక్‌నాథ్ షిండే తెలిపారు. అయితే చివ‌ర‌గా ఓ సారి అజిత్‌ను క‌న్విన్స్ చేస్తామ‌ని ఎన్సీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నికైన జ‌యంత్ పాటిల్ తెలిపారు.

Shiv Sena In Lemon Tree

ఒక‌వేళ ఫ‌డ్న‌వీస్ మెజారిటీ నిరూపించ‌కోలేక‌పోతే, అప్పుడు అసెంబ్లీని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని, అందుకే తాము ముందు త‌మ ఎమ్మెల్యేల జాబితాను విడుద‌ల చేశామ‌ని జ‌యంత్ పాటిల్ తెలిపారు. అదే లేఖ‌లో ఎన్సీపికి చెందిన 51 మంది ఎమ్మెల్యేలు సంత‌కం చేశారు. అజిత్‌ప‌వార్‌, అన్నా బాన్సోడే, ధ‌ర్మారావు ఆత్రంల పేర్లు మాత్రం ఆ లేఖ‌లో లేవు.

కాగా, గత కొద్దిరోజులుగా లలిత్ హోటల్‌లో బస చేస్తున్న శివసేన ఎమ్మెల్యేలు సోమవారం సుప్రీం ప్రకటన అనంతరం ఆ హోటల్‌ను ఖాళీ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను లలిత్ హోటల్ నుంచి లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్‌కు శివసేన తరలించింది. ఈ సందర్భంలో హోటల్ నుంచి బయటకు వస్తున్న శివసేన ఎమ్మెల్యేలు విక్టరీ సింబల్ చూపించారు.

ప్రభుత్వ ఏర్పాటుపై దీమా వ్యక్తం చేశారు. మరోపక్క ఎన్సీపీ కూడా ఎమ్మెల్యేలను మరో హోటల్‌కు తరలించినట్లు తెలిసింది. శివసేన ఎమ్మెల్యేలు ఏ హోటల్‌లో ఉన్నా.. ఆ పార్టీ కార్యకర్తలు హోటల్ బయట కాపు కాస్తున్నట్లు సమాచారం. పార్టీ వ్యక్తులను తప్ప వేరే వారెవరూ హోటల్‌లోకి వెళ్లకుండా శివసేన నిఘా పెట్టినట్లు తెలిసింది.