Hyderabad, August 27: తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్‌ (Nithin), ప్రముఖ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ (Mithali Raj) విడివిడిగా కలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. నితిన్-నడ్డా భేటీ దాదాపు అరగంటకు పైగా సాగిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ (MP Laxman) తెలిపారు. అమిత్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ సమావేశంలో కూడా రాజకీయాలు చర్చకు వచ్చాయన్నారు.

మతాల పేరిట గొడవలు పెట్టుకోమ్మని ఏ దేవుడు చెప్పాడు, హైదరాబాద్‌ గొడవలపై స్పందించిన కేటీఆర్, ప్రజలు ఏం తినాలో బీజేపీ డిసైడ్ చేస్తుందా? అంటూ మండిపడ్డ కేటీఆర్‌

ప్రధాని మంత్రి నరేంద్రమోదీ కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి సినీనటుడు నితిన్‌ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బీజేపీ తరపున ప్రచారం చేయడానికి మిథాలీ రాజ్‌ కూడా సిద్ధంగా ఉందన్నారు. త్వరలో నితిన్‌, మిథాలీరాజ్‌ ఇరువురు కూడా ప్రధాని నరేంద్ర మోదీ కలవనున్నట్లు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మోదీ సూచన మేరకే మొదట బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లు నితిన్‌, మిథాలీ రాజ్‌ తెలిపారు. మోదీ (Modi) పాలనపై ముగ్ధులమయ్యామని వీరివురు పేర్కొన్నారు.