INS Brahmaputra Fire

Mumbai, July 24: భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్ర (INS Brahmaputra Fire) బోల్తాపడిన ఘటనలో గల్లంతైన యువ నావికుడు సితేందర్‌ మృతదేహం లభ్యమైంది. ఆదివారం ముంబైలోని నావల్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్ర అగ్నిప్రమాదం (INS Brahmaputra Fire) చోటుచేసుకుని ఒకవైపునకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో భారత నౌకా దళానికి చెందిన ఓ నావికుడు గల్లంతయ్యాడు. మూడు రోజుల నుంచి ముమ్మర గాలింపులు నిర్వహించిన తర్వాత ఇవాళ ఆ నావికుడి మృతదేహం (Sailor Sitendra Singh) లభ్యమైంది.

 

ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్ర ప్రమాదానికి గురైన వెంటనే నేవీకి చెందిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. మంగళవారం నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ త్రిపాఠి ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. గల్లంతైన నావికుడు సితేందర్‌ ఆచూకీ గుర్తించాలని, వీలైనంత త్వరగా నౌకను పునఃప్రారంభించాలని అధికారులకు సూచించారు.

సితేంద్ర మరణవార్త (Sailor Sitendra Singh) తెలిసిన వెంటనే నేవీ చీఫ్‌ త్రిపాఠి తీవ్ర సంతాపం ప్రకటించారు. సితేందర్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ బాధాకరమైన సమయంలో భారత నౌకాదళం ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు.