EAM S Jaishankar (Photo Credit: ANI)

New Delhi, August 30: దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan) విషయంలో భారత్‌ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. ఇకమీదట సానుకూలమైనా ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

పాకిస్థాన్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం (Era of Uninterrupted Dialogues With Pakistan Over) ముగిసింది. మన దేశం పట్ల పాకిస్థాన్‌ ఎలా వ్యవహరిస్తే.. మనం కూడా అందుకు తగిన విధంగా బదులిస్తాం. పాక్‌ నుంచి వచ్చే చర్య సానుకూలమైనా ప్రతికూలమైనా తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది.  కడప, కర్నూలు జిల్లాల్లో కొత్తగా స్మార్ట్ సిటీలు, దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, తెలంగాణలో ఎక్కడంటే..

పరిస్థితులకు అనుగుణంగా భారత్‌ ముందడుగు వేస్తుంది’ అని జై శంకర్‌ (EAM S Jaishankar) స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల జమ్మూలో తరచూ జరుగుతున్న ఉగ్రదాడులతో ఇరుదేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో వెనక్కి తగ్గరన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు ఓ ముగిసిన కథ అని జైశంకర్‌ పేర్కొన్నారు.

Here's Video

బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి జైశంకర్‌ ప్రస్తావించారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి దేశం తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. అక్కడి హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వారి భద్రత విషయంలో ఆందోళన వ్యక్తంచేశారు. పొరుగుదేశాలతో సమస్యలు ఉండని దేశమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించారు. దేశాల మధ్య పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్‌తో సత్సంబంధాలు కలిగి ఉంటుందని జై శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌తో మాట్లాడారు. కాగా దేశంలోని మైనారిటీలు, హిందువుల భద్రతకు యూనస్‌ మోదీకి హామీ ఇచ్చారు. మైనారిటీలపై దాడుల గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

కాగా మార్చిలో సింగపూర్‌ పర్యటనలో భాగంగా జైశంకర్‌ మాట్లాడుతూ పాక్‌పై మండిపడ్డారు. ‘‘ఒక పరిశ్రమ స్థాయిలో పాకిస్థాన్‌(Pakistan) ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితిలో భారత్‌ లేదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొనాలి. ప్రతి దేశమూ ఒక సుస్థిరమైన పొరుగుదేశాన్ని కోరుకుంటుంది. అదీ కాకపోతే, కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుంది. పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలేయలేం’’ అని జైశంకర్ స్పష్టంచేశారు.