Hathras Police with the persons accused of involvement in the killing of a boy from a school on September 27, 2024 | Photo Credit: X/@hathraspolice

Lucknow, Sep 27: యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరిట హత్రాస్‌లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారు. విద్యార్ధి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందుతుందని స్కూల్‌ హాస్ట్‌లోనే బాలుడిని హత్య (‘Human Sacrifice’ in UP) చేశారు. వారం కిందట జరిగిన ఈ అమానుషం తాజాగా వెలుగులోకి వచ్చింది.

మృతుడైన విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల యజమాని జసోదన్‌ సింగ్‌తో, అతని కుమారుడు దినేష్‌ భఘేల్‌ పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల కృతార్థ్‌ హత్రాస్ జిల్లాలోని రస్‌గవాన్‌లోని డీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు.

షాకింగ్ వీడియో, వాగు దాటేందుకు బాలింత కష్టాలు, భుజంపై మోసి పెద్దేరు వాగును దాటించిన కుటుంబ స‌భ్యులు

ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం స్కూలు నుంచి ఆయనకు కాల్‌ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్‌ వద్దకు వెళ్లగా.. బాలుడిని పాఠశాల డైరెక్టర్‌ తండ్రి తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్‌ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్‌కు మీ కొడుకు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు.

అయితే కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో స్కూల్​ డైరక్టర్​ తండ్రి దినేశ్​ బఘేల్‌కు క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు. బాలుడిని తొలుత స్కూల్​ బయట ఉన్న గొట్టపు బావి ​​ దగ్గర చంపాలని భావించారు. కానీ హాస్టల్​ నుంచి బయటకు తీసుకువెళుతుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా అక్కడే, అతడి గొంతు నులిమి చంపేశారు.

స్కూల్‌కు సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. అయితే స్కూల్​ సక్సెస్​ కోసం క్షుద్రపూజలు చేయాలని నిందితులు గతంలో కూడా ప్లాన్​ వేశారు. సెప్టెంబర్​ 6వ తేదీన 9వ తరగతి స్టూడెంట్​ ని బలి ఇవ్వాలని చూశారు. కానీ విఫలం అయ్యారని తేలింది.