New Delhi, SEP 25: సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై (Kangana Ranaut) కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ఇప్పటికే ఉప సంహరించుకున్న వ్యవసాయ చట్టాలను (3 Farm Laws) తిరిగి తీసుకురావాలని కంగనా చేసిన ప్రకటనపై రాహుల్ స్పందిస్తూ ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు ? బీజేపీ ఎంపీనా.. లేక ప్రధాని మోదీనా? అంటూ ప్రశ్నించారు. 700 మందికిపైగా రైతులు రైతులు బలిదానం చేసినా బీజేపీ నేతలు పట్టడం లేదని విమర్శించారు. దేశంలో మళ్లీ దుమారం రేపాలనుకుంటున్నారా..? అంటూ నిలదీశారు. కంగనా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
‘Who Is Deciding Government’s Policy’ Tweet
सरकार की नीति कौन तय कर रहा है? एक भाजपा सांसद या प्रधानमंत्री मोदी?
700 से ज़्यादा किसानों, खास कर हरियाणा और पंजाब के किसानों की शहादत ले कर भी भाजपा वालों का मन नहीं भरा।
INDIA हमारे अन्नदाताओं के विरुद्ध भाजपा का कोई भी षडयंत्र कामयाब नहीं होने देगा - अगर किसानों को नुकसान… pic.twitter.com/ekmHQq6y5D
— Rahul Gandhi (@RahulGandhi) September 25, 2024
ఇండియా కూటమి అన్నదాతలపై చేస్తున్న కుట్రలను సహించదన్నారు. రైతులను నష్టం కలిగించేలా ఏదైనా చర్య తీసుకుంటే ప్రధాని మరోసారి క్షమాపణలు చెప్పాలను. మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం మండిపడింది. ఆమె చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని పేర్కొంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను అంగీకరించకపోతే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెబుతారన్నారు.