Amritsar, June 02: పంజాబ్‌లోని (Punjab) అమృత్ సర్‌లో (Amritsar) ఓ కాలేజీలో విద్యార్ధుల మధ్య చెలరేగిన గొడవ...తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కాలేజీ అమ్మాయి (College Girl) విషయంలో ఈ గొడవ చెలరేగినట్లు తెలుస్లోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఖల్సా (Khalsa)కాలేజీలో ఒక అమ్మాయి విషయంలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది క్రమంగా పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కాలేజీ గేటు వద్ద ఒక గ్రూప్ విద్యార్థులు, మరో గ్రూప్ విద్యార్థులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులకు బుల్లెట్టు గాయాలయ్యాయి. వీరిలో ఒక విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.
Punjab | Two persons injured in a clash between two groups outside Khalsa College, Amritsar
Shots were fired during the clash between two groups outside the college. The situation is under control. It was a routine crime, not a gang war. Further probe underway: Police pic.twitter.com/nWbeeoNrJO
— ANI (@ANI) June 1, 2022
గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడిని బాటాలాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌గా (Lovepreet singh)గుర్తించారు. గాయపడ్డ విద్యార్థిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాలేజీ ప్రాంగణంలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి, నిందితులను గుర్తిస్తామని చెప్పారు.
కాల్పుల ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసుల...రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఇది కేవలం రెండు వ్గాల మధ్య జరిగిన గొడవ మాత్రమే అని తెలిపారు పోలీసులు. విద్యార్ధులంతా సంయమం పాటించాలని కోరారు.