Rape Representative image.

Lucknow, July 14: దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా యూపీలో మ‌హిళ‌లు, యువ‌తులు, చిన్నారుల‌పై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. తాజాగా హోట‌ల్‌లో ప‌నిచేస్తున్న యువ‌తి (21)పై క‌దులుతున్న కారులోనే అత్యాచారం చేయబోయాడు ఓ కామాంధుడు. దీన్ని ఆ యువతి ప్రతిఘటించి ఎస్‌యూవీ నుంచి (Girl jumps off moving SUV) దూకింది. దీంతో తీవ్ర యువ‌తికి గాయాల పాలైంది. ఈ ఘ‌ట‌న ల‌క్నోలోని జ‌నేశ్వ‌ర్ మిశ్రా పార్క్ వ‌ద్ద జ‌రిగింది.

తన తోటి స‌హ‌చ‌రుడే ఈ దారుణానికి ఒడిగ‌ట్ట‌డంతో త‌న‌ను తాను కాపాడుకునేందుకు (escape molestation) యువ‌తి కారు నుంచి బ‌య‌ట‌కు దూక‌డంతో అటుగా వెళుతున్న వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. గాయాలైన యువ‌తిని (sustains injuries) చికిత్స నిమిత్తం పోలీసులు రాం మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కోలుకున్న అనంత‌రం యువ‌తి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం హోట‌ల్‌లో ప‌నిచేసే యువ‌తితో ప‌రిచ‌యం పెంచుకున్న నిందితుడు త‌న మేన‌కోడ‌లు కూడా హోట‌ల్ మేనేజ్‌మెంట్ చేసేందుకు ఆస‌క్తి చూపుతోంద‌ని ఆమెకు సాయం చేయాల‌ని కోరాడు.

యూపీలో ఓ కసాయి తల్లి దారుణం.. ఆరేళ్ల కూతురు ప్రైవేట్ భాగాలపై సలసల కాగే నూనె పోసింది, నొప్పితో విలవిలలాడిన బాలిక, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

యువ‌తి ఇంటి నుంచి హోట‌ల్‌కు వెళుతుండ‌గా తాను కారులో డ్రాప్ చేస్తాన‌ని లిఫ్ట్ ఆఫ‌ర్ చేశాడు. కొద్ది దూరం వెళ్లిన త‌ర్వాత యువ‌తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో షాక్‌కు గురైన బాధితురాలు ఎస్‌యూవీ నుంచి కింద‌కు దూకింది. ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న పోలీసులు రెండు గంట‌ల్లోనే నిందితుడిని ప‌ట్టుకున్నారు. నిందితుడు వాడిన ఎస్‌యూవీని సీజ్ చేశారు.