Uttar Pradesh Horror: యూపీలో ఓ కసాయి తల్లి దారుణం.. ఆరేళ్ల కూతురు ప్రైవేట్ భాగాలపై సలసల కాగే నూనె పోసింది, నొప్పితో విలవిలలాడిన బాలిక, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన దత్త కుమార్తెను (6-Year-Old Adopted Daughter) దారుణంగా హింసించింది. ఆ చిన్నారి ప్రైవేట్ భాగాల్లో కాలుతున్న నూనె పోసి చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటు చేసుకుంది.

Uttar Pradesh Horror: యూపీలో ఓ కసాయి తల్లి దారుణం.. ఆరేళ్ల కూతురు ప్రైవేట్ భాగాలపై సలసల కాగే నూనె పోసింది, నొప్పితో విలవిలలాడిన బాలిక, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
Physical Torture (credit - IANS)

Lucknow, July 14: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన దత్త కుమార్తెను (6-Year-Old Adopted Daughter) దారుణంగా హింసించింది. ఆ చిన్నారి ప్రైవేట్ భాగాల్లో కాలుతున్న నూనె పోసి చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35 ఏళ్ల మహిళ పూనమ్‌ తన భర్త అజయ్ కుమార్ తో కలిసి ఠాకూర్‌గంజ్‌లో నివసిస్తోంది. వీరిద్దరికి పిల్లలు లేకపోవడంతో ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ప్రతి రోజూ చిత్రహింసలు పెట్టడం ఆ తల్లి (Woman in Lucknow) స్టార్ట్ చేసింది. ఆమె భర్త ఫుడ్ ట్రక్ నడుపుతున్నాడు. అతను డ్యూటీకి వెళ్లినప్పుడల్లా ఈ కసాయి తల్లి ఆమెను చిత్రహింసలకు గురిచేసేది.

మైనర్‌పై తెగబడిన నలుగురు కామాంధులు, బాలిక శీలానికి లక్ష రూపాయలు వెలకట్టిన గ్రామ పెద్దలు, పోలీసులకు తెలియడంతో నిందితులంతా కటకటాల్లోకి

రోజు లాగే బుధవారం కూడా అతను పనికివెళ్లగా.. ఈ 35 ఏళ్ల మహిళ తన ఆరేళ్ల దత్తపుత్రికపై సలసల కాగే నూనె ( Hot Oil) పోసింది. ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పడటంతో ఆ చిన్నారి నొప్పితో అల్లాడిపోయింది. డ్యూటీ నుంచి వచ్చిన దత్త తండ్రి ఈ దారుణాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం అర్థరాత్రి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాలికను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

(The above story first appeared on LatestLY on Jul 14, 2022 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).