Bengaluru, August 5: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్ను దొంగిలించాడని ఆరోపిస్తూ మూడో తరగతి విద్యార్థిపై ఆశ్రమం నిర్వాహకులు అమానుషంగా ప్రవర్తించారు. కనికరం లేకుండా కర్రతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, మూడు రోజులపాటు గదిలో బంధించారు. రాయచూర్‌లోని ఓ ఆశ్రమంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాధిత బాలుడి పేరు తరుణ్ కుమార్ గా గుర్తించారు.ఆ పిల్లవాడు రాయచూర్‌లోని రామకృష్ణ ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్, ఆయన సహాయకులు కలిసి పెన్ను దొంగిలించాడంటూ ఈ దారుణానికి ఒడిగట్టారు. వాళ్లు కొట్టిన దెబ్బలకి అతని మొహం మొత్తం వాచిపోయింది. అయితే అతని తల్లి ఆదివారం తన పిల్లలను చూడటానికి రావడంతో జరిగిన విషయాన్ని అరుణ్ ఆమెకు వివరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తరుణ్‌ను ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు. దారుణం, మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై అత్యాచారయత్నం, బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్
ఇద్దరు అబ్బాయిలు, టీచర్ కొట్టారు. కర్రతో కొట్టినప్పుడు అది విరిగిపోయింది. అప్పుడు బ్యాట్‌తో కొట్టారు. శరీరంపై గాయాలు కూడా చేశారు. ఆ తర్వాత యాద్గిర్ తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వద్ద అడుక్కోమన్నారు. కానీ, ఎవరూ డబ్బులు ఇవ్వలేదు’’ అని తరుణ్ చెప్పుకొచ్చాడు. పెన్ను కోసమే తనను కొట్టారని పేర్కొన్నాడు. వారు దెబ్బల ధాటికి తరుణ్ రెండు కళ్లు వాచిపోయాయి.