10-foot King Cobra discovered on super-fast train in Uttarakhand (Photo-Twitter)

Uttarakhand, November 27: సాధారణంగా నగర శివార్లలో, పొలాల్లో అడవుల్లో పాములు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య రైలు లోకి కూడా పాములు వచ్చేస్తున్నాయి. 10 అడుగులు ఉండే నల్ల త్రాచు పాము(10 foot King Cobra) రైల్లో ప్రయాణీకులను హడలెత్తించిన సంఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని ఖత్గోడమ్ రైల్వే స్టేషన్(Kathgodam Railway Station) లో ఓ నల్ల త్రాచు పాము సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్లోకి ప్రవేశించింది.

అయితే ప్రయాణికులంతా రైలు ఎక్కేశారు. ఇక బయల్దేరడమే ఉంది. ఇంతలో పాము అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. రైల్లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

రైలు కాంపార్ట్ మెంటులోని డోర్ దగ్గర పాము ఉండటంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులకు వెంటనే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. రెస్య్కూ టీంకు సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. అదృష్టవశాత్తూ ఎవరి ప్రాణాలకు హాని జరగలేదు.

నెటిజన్ ట్వీట్ 

ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, ఆర్పీఎఫ్ (Forest Department and RPF) కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ఎంతో నేర్పుతో గంటలకొద్ది వ్యవహరించారు. ఎట్టకేలకు కింగ్ కోబ్రాను పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశారు. కింగ్ కోబ్రాను పట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.