Mumbai/vadodara, January 12: శనివారం నార్త్ ఇండియాలో (North India) రెండు రాష్ట్రాల్లో పేళుల్లు సంభవించాయి. గుజరాత్, మహారాష్ట్రలోని (Gujarat) కంపెనీల్లో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ రెండు చోట్ల జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మంటల్లో కాలిపోయారు. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఎక్కువగా కార్మికులే ఉన్నారు. పూర్తి వివరాల్లోకెళితే..
గుజరాత్ గ్యాస్ ఫ్యాక్టరీలో పేలుడు
గుజరాత్ వడోదర జిల్లాలోని ఓ మెడికల్ గ్యాస్ తయారీ కర్మాగారంలో(Gas manufacturing unit) శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో పద్రా తహసీల్ గవాసద్ గ్రామంలోని ఎయిమ్స్ ఇండస్ట్రీస్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. సిలిండర్లలో గ్యాస్ నింపే సమయంలో ఈ పేలుడు సంభవించిందని వడోదర రూరల్ ఎస్పీ సుధీర్ చెప్పారు.
మంటల్లో కాలి బూడిదైన టూరిస్టు బస్సు
పరిశ్రమలు, వైద్యరంగానికి అవసరమైన గ్యాస్‌లను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్ ఇతర వాయువులను కంపెనీ తయారు చేస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది సజీవదహనం
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దేశ రాజధానిలో మరో ఘోర అగ్ని ప్రమాదం
మహారాష్ట్ర కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా బోయిసర్‌లోని కెమికల్ ఫాక్టరీలో (Chemical factory)భారీ పేలుడు సంభవించింది.
Here's ANI Tweet
Palghar District Magistrate, Kailash Shinde: CM has announced ex-gratia of Rs 5 Lakh each to the next of the kin of the deceased. The state govt will bear the expenses of all the injured. https://t.co/DctBJhLWAR pic.twitter.com/GFI2dukqfn
— ANI (@ANI) January 12, 2020
ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఆంక్ అనే నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలో శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో కొన్ని కెమికల్స్‌ను పరీక్షిస్తున్న క్రమంలో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, పేలుడు ధాటికి కంపెనీ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కిటికీలు బద్ధలయ్యాయని తెలిపారు.
మాంసపు ముద్దలుగా శరీరాలు, 43 మంది మృతి
ఈ ప్రమాదంలో మృతి చెందినవారికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే గాయపడిన వారందరి చికత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భర్తిస్తుందని పాల్ఘర్ జిల్లా మేజిస్ట్రేట్, కైలాష్ షిండే తెలిపారు.