Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది సజీవదహనం..,మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం, కొనసాగుతున్న సహాయక చర్యలు, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
Uttar Pradesh: Truck, bus catch fire after collision, 24 feared dead (Photo-ANI)

Kannauj, January 11: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh)ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో (Truck, bus catch fire) మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారు. కన్నౌజ్‌ జిల్లాలోని (Kannauj)చిబ్రమౌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు, డీజిల్‌ ట్యాంకర్‌ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో దాదాపు 20 మంది సజీవదహనమైనట్లు తెలుస్తోంది. పోలీసులు 21 మందిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మంటల్లో కాలి బూడిదైన టూరిస్టు బస్సు

సమాచారం తెలియగానే, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది (Fire tenders)ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. 21 మందిని రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ఐజీపీ మోహిత్‌ అగర్వాల్‌ (Mohit Agarwal) తెలిపారు. మంటలను అదుపుచేశామని, సహాయచర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాద సమాచారం తెలియగానే సీఎం ఆదిత్యనాథ్‌ తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఈ ఘటనపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు.

Here's The ANI Tweet

 

ఫరుఖాబాద్‌ నుంచి 50మంది ప్రయాణికులతో జైపుర్‌ బయల్దేరిన ఏసీ బస్సు చిలోయి వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ధాటికి మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి.

Here's The PM Tweet

వాహనాలు బలంగా ఢీకొనడంతో డీజిల్‌ ట్యాంకు పగిలి భారీగా మంటలు విస్తరించి ఉండవచ్చని అంటున్నారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయచర్యలు అందించాలని పోలీసులను ఆదేశించారు.

దేశ రాజధానిలో మరో ఘోర అగ్ని ప్రమాదం

ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ. 2లక్షలను.. గాయపడినవారికి రూ.50వేలను ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు నిద్రపోతూ ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి పొగమంచే కారణమని తెలుస్తోంది. మంచువల్ల ఎదురుగా ట్రక్ వస్తున్న విషయాన్ని డ్రైవర్ గుర్తించలేకపోయి ఉండొచ్చని కొందరు అంటుంటే... ట్రక్‌కి ఫ్రంట్ హెడ్ లైట్లు వెలిగే ఉంటాయి కాబట్టి... డ్రైవర్ నిద్ర మత్తులో ఢీకొట్టి ఉంటారని కొందరు అంటున్నారు.