Earthquake Representative Image (Photo Credit: PTI)

జమ్మూ కశ్మీర్‌ (Jammu And Kashmir) రాష్ట్రంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం 9:34 గంటల ప్రాంతంలో దోడా (Doda) జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.9గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

మరో వైపు ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో (Uttarkashi) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2.02 గంటలకు ఉత్తరకాశీలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూకంప కేంద్రం రాజధాని డెహ్రూడూన్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన, బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, పలు పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

కాగా, అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదని అధికారులు వెల్లడించారు. ఉత్తరకాశీలో గత 15 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడో సారి.