Delhi Rape Case: సిగ్గుచేటు..94 ఏళ్ల ముసలమ్మపై అత్యాచారం. దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధిత వృద్దురాలిని పరామర్శించిన ఢిల్లీ క‌మిష‌న్ ఫ‌ర్ ఉమెన్ చీఫ్
Representational Image (Photo Credits: File Image)

New Delhi, Sep 9: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కామాంధులకు వయసు కూడా తెలియడం లేదు. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నజఫ్‌గర్ ప్రాంతంలోని ఛావ్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(DCW) సీరియస్ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి (37-year-old man arrested) ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీడబ్ల్యూ ధృవీకరించింది. ఆ వ్య‌క్తిని పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఢిల్లీ చావ్లాలోనా న‌జాఫ్‌గంజ్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వ్య‌క్తి అదే అదే ప్రాంతంలో నివ‌సిస్తున్న వృద్ధురాలిపై లైంగిక‌దాడికి తెగ‌బ‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ( డీసీడబ్ల్యూ ) చీఫ్ స్వాతి మాలివాల్ (Delhi Commission for Women (DCW) chief Swati Maliwal) బాధిత వృద్దురాలిని ప‌రామ‌ర్శించారు. కామాంధుడి లైంగిక దాడిలో (Delhi Rape Incident) ఆమె తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపారు. స్వామి మనివాల్ స్వయంగా ఆ వృద్ధురాలిని కలిసి...దారుణ ఘటనపై ఆరా తీశారు.

Here's Delhi Commission for Women (DCW) chief Swati Maliwal Tweet

ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కంటతడి పెట్టుకున్న ఆ వృద్ధురాలు...నిందితుడిని ఉరితీయాలని కోరినట్లు తెలిపారు. కాగా ఘ‌ట‌న జ‌రిగిన 24 గంట‌ల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయ‌డం విశేషం. నిందితుడు ప్లంబర్ పనులు చేసేవాడని పోలీసులు నిర్థారించారు. పోలీసుల చ‌ర్య‌ను ప్ర‌శంసిస్తూ ప‌లువురు నెటిజ‌న్లు ట్వీట్ చేస్తున్నారు.