Fire (Representational image) Photo Credits: Flickr)

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మురికివాడలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీలోని గోకుల్ పురిలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రేగడంతో పూరి గుడెసెల్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారు. 60 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.

మంటలు అదుపులోకి... మరికొందరు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తెలిసింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు ప్రయత్నాలు చేస్తున్ానయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.