7th Pay Commission | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, Oct 21: కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్ర క్యాబినెట్ తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 7th పే కమిషన్ కింద (7th Pay Commission) క‌రువు భ‌త్యాన్ని మూడు శాతం (DA Hiked by 3 Percent Ahead of Diwali 2021) పెంచింది. కేంద్ర పెన్ష‌ర్ల‌కు కూడా మూడు శాతం డీఏను పెంచారు.ఈ మేరకు ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

సమావేశం అనంతరం దీనిపై కేంద్ర స‌మాచార‌శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగులకు ఇచ్చే డీఎ, పెన్సనర్లకు ఇచ్చే డీఆర్ ను 3 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు జూలై 2021 నుంచే అమలవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28 శాతం, ఉండగా తాజా నిర్ణయంతో 31 శాతానికి చేరింది.

కేంద్రం నిర్ణయంతో 47. 14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68. 62 లక్షల మంది ఫించన్ దారులకు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా 9, 488.70 కోట్ల మేర అదనపు భారం పడనుంది, కరోనా మహమ్మారితో సంక్షోభం ఇప్పటికే నెలకొని ఉండగా గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ ఏడాది జూలై నుంచి దాన్ని పునరుద్ధరించడమే కాకుండా గాక 17 శాతం ఉన్న డీఏను 28 శాతానికి పెంచారు. ఇప్పుడు మరో 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

దేశంలో వంద కోట్ల మార్కును దాటిన కరోనా టీకాల పంపిణీ, తాజాగా 18,454 కొత్త కోవిడ్ కేసులు, 2021 జనవరి 16న భారత్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్

దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కూడా పెంచింది. బేసిక్ శాలరి మీద వారికి 31 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం..రూ. 18 వేలు ఉన్నవారికి అదనంగా మరో రూ. 540 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వారు సంవత్సరానికి రూ. 6480 హైక్ అందుకుంటారు. నెలకు రూ. 2,25000 జీతం  ఉన్నవారు నెలకు రూ. 6750 చొప్పున సంవత్సరానికి 81,000 అదనంగా అందుకుంటారు.

31 శాతం పెరుగుదలతో నెల, సంవత్సర జీతం ఇలా ఉంటుంది.

బేసిక్ శాలరీ రూ. 18 వేలు ఉన్నవారికి

EDA (Exisiting Dearness Allowance (28%) RS. 5040/Month

NDA (New Dearness Allowance) (31%) RS. 5580/Month

CalCulate Difference : 5580-5040= RS. 540/month

Increase Annual Salary : 540*12 =6,480

బేసిక్ శాలరీ రూ. 2,25,000 వేలు ఉన్నవారికి

EDA (Exisiting Dearness Allowance (28%) RS. 63,000/Month

NDA (New Dearness Allowance) (31%) RS. 69750/Month

Calculate Difference : 68,750-63,000= RS. 6,750/month

Increase Annual Salary : 540*12 = 81000