JN.1 Variant in India: దేశంలో 971 కి పెరిగిన JN.1 కేసులు, కొత్తగా 609 మందికి కరోనా, నిన్న ముగ్గురు మృతి, నేటి కరోనా వైరస్ కేసుల అప్‌డేట్స్ ఇవిగో..
(Photo Credits: Pixabay)

Covid Cases in India:  దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) నమోదయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health ministry) శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలతో మృతి చెందిన వారి సంఖ్య 5,33,412కి చేరింది.

గబ్బిలాల నుంచి బ్యాట్ అనే మరో కొత్త వైరస్, కరోనాను మించి ప్రమాదకరంగా మారబోతుందని తెలిపిన వుహాన్ ప్రయోగాలతో ముడిపడి ఉన్న రీసెర్చ్ బృందం

కరోనా వైరస్‌ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,44,84,162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,82,446) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.ఇక 16 రాష్ట్రాల నుండి జనవరి 11 వరకు COVID-19 యొక్క JN.1 వేరియంట్ యొక్క 971 కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు తెలిపాయి.