Fuel Price Spike: సామాన్యులపై మరోసారి పెట్రోబాంబు, పదిరోజుల్లో తొమ్మిదోసారి ధరల పెంపు, ప్రతీరోజు సగటున 80 పైసలకు పైగా పెంపు, బెంబేలెత్తుతున్న సామాన్యులు
Petrol Pump (Photo Credits: PTI)

Hyderabad, March 31: సామాన్యులకు కేంద్రం పెట్రోవాత కొనసాగుతోంది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను (fuel price spike) పెంచుతూ చమురుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.గత పదిరోజుల్లో తొమ్మిదిసార్లు ధరలను పెంచిన సంస్థలు తాజాగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) పై 80 పైసలు చొప్పున పెంచాయి. ఈ పెంపుతో హైదరాబాద్ (Hyderabad) లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.40 కు చేరగా.. డీజిల్ ధర 101.56 కు చేరింది. ఇక తొలి నుండి రేటు అధికంగా ఉన్న ఏపీలో విజయవాడ (Vijayawada)లో లీటర్ పెట్రోల్ ధర రూ.117, డీజిల్ ధర రూ.103 దాటింది. గత శ‌నివారం చ‌మురు కంపెనీలు పెట్రోల్‌పై 89 పైస‌లు, డీజిల్ పై 86 పైస‌లు పెంచడంతో మొదలైన ఈ బాదుడు ప్రతిసారి 80 పైసలు పైన పెంచుతూ వస్తున్నాయి. చమురు కంపెనీల పెంపుకు మళ్ళీ రాష్ట్రాల పన్నులు కలుపుకుంటే ఇది 90 పైసల పైనే ఉంటుంది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో 137 రోజులు పెట్రోలు, డీజిల్‌ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే కేంద్రం చమురు ధరలను పెంచలేదని విపక్షాలు ఆరోపించాయి. ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల్లోనే ధరలను పెంచడం మొదలుపెట్టాయి చమురు సంస్థలు. గడిచిన పదిరోజుల్లో ఒక రోజు మినహా ప్రతీ రోజూ ధరలను పెంచుతూ వెళ్లాయి.

Violence At Kejriwal Home: కేజ్రీవాల్ ఇంటి గేటు మీదకు ఎక్కిన బీజేపీ ఎంపీ, సీఎం ఇంటి దగ్గర బీజేపీ విధ్వంసం, కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ యత్నించిందని ఆప్ ఆరోపణ, సీఎం ఇంటి గేటుకు కాషాయరంగు పూసిన నిరసనకారులు

అంతర్జాతీయంగా బ్యారెల్ ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి ఆరంభంలో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ సమయంలో బ్యారెల్‌ ధర 139 డాలర్లకు కూడా చేరింది. అయినా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల్లో మార్పులు చేయలేదు. ఎన్నికల అనంతరం గత వారం నుంచి బాదుడు మొదలవగా.. నిపుణుల అంచనా ప్రకారం ధరలు రూ.120-125 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది.