Pune, March 10: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వివాహితపై సొంతమామలే అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమె పీరియడ్స్ కు సంబంధించిన రక్తాన్ని రూ. 50వేలకు అమ్ముకున్నారు (Period Blood Sold In Maharashtra). ఆ రక్తాన్ని క్షుద్రపూజలు (witchcraft rituals) చేసేవారికి అమ్ముకున్నట్లు వివాహిత ఆరోపించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటు చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శివసేనకు చెందిన ఎమ్మెల్సీ మనిషా కాయండే ఈ ఘటనకు సంబంధించిన అంశాలను లెజిస్టేటివ్ కౌన్సిల్ లో లేవనెత్తారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పుణెలోని విశ్రాంత్‌వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆమె చెప్పారు
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పుణెకు చెందిన మహిళ 2019లో ప్రేమించి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆమెను కట్నం కోసం తన మామతో పాటూ ఇతర బంధువులు ఇబ్బంది పెడుతున్నారు. వారికి భర్త కూడా తొడై వేధించసాగారు. వాటిని మౌనంగా భరిస్తూ వచ్చింది. కానీ ఇటీవలకాలంలో వారి ఆగడాలు మరింత ఎక్కువై పోయాయి.
నెలసరి సమయంలో ఆమెను తాళ్లతో బంధించిన ఆమె భర్త, మామయ్య, ఇతర బంధువులు...తన పీరియడ్స్ రక్తాన్ని (menstrual blood sold) తీసుకున్నారు. దాన్ని క్షుద్రపూజలు చేసే వ్యక్తికి రూ. 50వేల రూపాయలకు అమ్మినట్లు మహిళ ఆరోపించింది. దీన్ని ప్రశ్నించినందుకు ఆమెపై లైంగిన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్తే ఈ అఘాయిత్యానికి సహకరించడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.