Man Stuck in Leopard Cage (PIC @ ANI Twitter)

Lucknow, FEB 24: ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. కానీ తెల్లారి వచ్చి చూసేసరికి అందులో ఓ మనిషి (man got stuck in a cage) ఇరుక్కున్నాడు. అది చూసి అధికారులతో పాటూ, స్థానికులు షాక్ అయ్యారు. ఇంతకీ అతను బోన్ లో ఎందుకు పడ్డాడో తెలుసా? పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని (rooster) చోరీ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే డోర్‌ మూసుకుపోవడంతో ఆ వ్యక్తి పులి (leopard) బోనులో చిక్కుకుపోయాడు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో జరిగింది. ఆ జిల్లా పరిధిలోని బసెందువా గ్రామంలో ఒక చిరుత పులి సంచరిస్తున్నది. భయాందోళన చెందిన గ్రామస్తులు దాని గురించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిరుత జాడను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది దానిని పట్టుకునేందుకు ఆ గ్రామంలో ఒక బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎర కోసం ఆ బోనులో ఒక కోడిని ఉంచారు.

కాగా, పులి బోనులో ఉన్న కోడిపై ఒక వ్యక్తి కన్ను పడింది. ఆ కోడిని చోరీ చేసి ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినాలని అతడు భావించాడు. గుట్టుగా ఆ బోనులోకి ప్రవేశించాడు. లోపలున్న కోడిని పట్టుకున్నాడు. అయితే ఆ వెంటనే ఆ పులి బోను మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి బోను లోపల చిక్కుకున్నాడు. తనను రక్షించాలంటూ అరవడంతోపాటు బోరున ఏడ్చాడు.

Mumbai Shocker: పుట్టిన రోజు మర్చిపోయాడని భర్తను రక్తమొచ్చేలా కొట్టిన భార్య, అడ్డువచ్చిన అతని తల్లిపై కూడా దాడి, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు 

మరోవైపు శుక్రవారం ఉదయం గ్రామస్తులు దీనిని గమనించారు. బోనులో పులికి బదులు ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చిరుత కోసం ఎరగా ఉంచిన కోడిని చోరీ చేసేందుకు ప్రయత్నించిన అతడు అందులో చిక్కుకున్నట్లు గ్రహించారు. అటవీ శాఖ అధికారులకు దీని గురించి సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు వెళ్లారు. బోను ముందున్న ఇనుప ఊచల డోర్‌ను తెరిచి ఆ వ్యక్తిని బయటకు రప్పించారు. కాగా, స్థానికులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.