AbhiBus Bumper Offer: బంపరాఫర్ ఇస్తున్న అభిబస్, టికెట్ బుక్ చూస్తే 3 కేజీల ఉల్లి ఉచితం, గోవా ట్రిప్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే, డీల్ ఆఫ్ ది ఇయర్ అంటున్న అభిబస్
AbhiBus Bumper Offer People choose 3 kg onions over free trip to Goa, call it 'deal of the year (photo-Pxhere)

Mumbai, December 13: ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు తెలివిగా ఈ అంశాన్ని తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉత్పత్తిని కొంటే ఉల్లిపాయలు ఉచితం అంటూ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అభిబస్ కూడా తమ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది.

ఆన్‌లైన్‌ బస్ టికెట్ బుకింగ్ సంస్థ అబిబస్‌.కామ్‌ (Abhibus) వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌ ద్వారా గోవా ట్రిప్‌ బుక్‌ చేసుకున్న వారికి 3 కిలోల ఉల్లిని(Three kilogram of onions) బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిని డీల్ ఆఫ్ ది ఇయర్( Deal Of The Year) గా ఆ సంస్థ తెలిపింది. దీంతో పర్యాటక ప్రీయులంతా ఈ ఆఫర్‌కు ఫిదా అవుతూ ఎక్కువగా గోవా పర్యటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే గోవా టూర్‌కు అధిక డబ్బులు వెచ్చించిన వారికి ఆపిల్‌ ఐఫోన్ (Apple IPhone) లేదా ఈ-బైక్‌లను గెలుచుకునే మరో ఆఫర్‌ను కూడా అభిబస్‌ ప్రకటించినప్పటికీ ఎక్కువమంది బుకింగ్‌లో ఉల్లిపాయ బహుమతినే ఎంచుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.

Here's Tweet

దీనిపై ఆ సంస్థ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ డిసెంబర్‌ 10న ప్రకటించిన ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించిందని చెప్పారు. 54శాతం మంది ​వినియోగదారులు గోవా (Goa)పర్యటనకంటే కూడా ఉల్లిపాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఆశ్యర్యపోయానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో బంగారు ఆభరణాలు, విలువలైన వస్తువుల కంటే ఉల్లికే అధిక డిమాండ్‌ ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు.

Here's Tweet

ఈ ఆఫర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. తాము వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు అందిస్తున్నామన్న సంతృప్తి కలిగిందని చెప్పారు. డిసెంబర్‌ 15 వరకు ఉండే ఈ ఆఫర్‌ కోసం అభిబస్‌ వెబ్‌సైట్‌ ద్వారా గోవా టూర్‌ (Goa Trip) బుక్‌ చేసుకోని పోటీలో నిలువవచ్చని చెప్పారు. ఈ ఆఫర్‌ ద్వారా ప్రతి రోజు 20 మందిని విజేతలుగా ప్రకటించి.. వారికి 3 కిలోల ఉల్లిని ఇంటికి డెలివరీ చేస్తామని రోహిత్‌ తెలిపారు.