Chandini-Manikandan Case: ఆ మాజీ మంత్రి పెళ్లి పేరుతో వాడుకుని వదిలేశాడు, నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నటి చాందిని, కోర్టులో వచ్చే నెల 5న విచారణకు రానున్న పిటిషన్‌
M Manikandan (photo Credits: IANS)

Chennai, July 24: అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు (Former Minister Manikandan) నటి చాందిని షాక్‌ ఇచ్చారు. తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ (asking Rs 10 crore compensation) గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్‌ పెళ్లి చేసుకుంటానని తనతో (Actress Chandini) సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు.

ప్రస్తుతం ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో మాజీమంత్రి మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరారు. కాగా నటి చాందిని పిటిషన్‌ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది.

ఆ మాజీ మంత్రి నాపై అత్యాచారం చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోలీవుడ్ నటి, ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు, ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపిన మణికందన్‌

నోమాడ్స్ చిత్రంతో పాపులారిటీ దక్కించుకున్న మలేషియా నటి చాందిని.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మంత్రిగారితో పరిచయం ఏర్పడింది. అది సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని.. అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ చాందిని తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాదు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

కాగా తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు.