Coronavirus Impact: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు షాక్, డిఎ, డీఆర్‌లన్నీ కట్, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Union Finance Minister Nirmala Sitharaman. (Photo Credit: PTI)

New Delhi, April 23: కరోనా (Coronavirus) మహమ్మారి విజృంభన.. లాక్‌డౌన్ (Coronavirus lockdown) నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Central Govt Employees), పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ (Dearness Allowance, Dearness Relief) పెంచకూడదనే నిర్ణయానికి వచ్చింది. గత నెలలో ప్రకటించిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) పంపిణీని కేంద్ర ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. లాక్‌డౌన్ పొడగింపుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై పిడుగు పాటు, తీవ్రంగా నష్టపోయిన రంగాలకు మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే యోచనలో కేంద్ర ప్రభుత్వం

4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ మార్చి13 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం అమలును నిలిపివేసింది. తద్వారా కేంద్ర ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ సుమారు 27,000 కోట్ల రూపాయలు భారాన్ని తగ్గించుకోనుంది. 2020 జనవరి 1 నుంచి జూన్ వరకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 49.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్నధరల కనుగుణంగా దీన్ని సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. తదుపరి సమీక్ష జూలైలో ఉండనుంది.

Here's the tweet by ANI:

కరోనా సంక్షోభం, మార్చి 24 నుంచి లాక్‌డౌన్ అమలవుతున్న కారణంగా పన్నుల నుండి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఉత్పత్తుల ఖర్చులు పెరిగాయి. నిధుల కొరత నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చులను తగ్గించుకుంటోంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి, మంత్రులు, అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుల జీతాలను ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం తగ్గించింది. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండు సంవత్సరాలు నిలిపివేసింది.

Here's the Finance Ministry's tweet:

దీంతోపాటు కరోనా బాధితులను, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వోద్యోగుల (రెవెన్యూ శాఖ) ఒక రోజు వేతనాన్ని కోత విధించి ఈ నిధులను పీఎం కేర్స్‌ జాతీయనిధికి జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తమ ఉద్యోగుల జీతాలను తగ్గించిన సంగతి తెలిసిందే. పీఎం కేర్స్ ఫండ్‌కు ఉద్యోగులందరూ ఏప్రిల్‌లో ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశే మిగిలే అవకాశముంది. అనుమతించేవి ఇవే, ఆంక్షలను సడలించిన కేంద్ర ప్రభుత్వం, లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగింపు

కరోనా నివారణ చర్యల్లో భాగంగా.. మార్చి 24 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది.. ఆ తర్వాత మరోసారి దానిని మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం.. దీంతో.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.. అన్ని రంగాలూ మూతపడ్డాయి. ఆర్థిక వనరులు మొత్తం దెబ్బతిన్నాయి.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆర్ధిక వ్యవస్థ కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని అంచనాలున్నాయి.

ఈ తరుణంలోనే డీఏ పెంచరాదని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2020 నుండి రావాల్సిన డీఏ పెంపును ప్రభుత్వం చెల్లించదు మరియు వచ్చే ఏడాది జూలై వరకు రేట్లు అలాగే ఉంటాయి అని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది. జనవరి 1, 2020 నుండి జూన్ 30, 2021 వరకు ఎటువంటి బకాయిలు చెల్లించబోమని స్పష్టం చేసింది.