Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

New Delhi, June 21: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంకు (Agnipath Recruitment Row) వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అవి హింసాత్మకంగా కూడా మారాయి. ఈ పరిస్థితుల మధ్య సుప్రీం కోర్టులో ఈ పథకానికి మూడు వ్యతిరేక పిటిషన్‌లు సైతం దాఖలు అయ్యాయి. ఈ తరుణంలో కేంద్రం మంగళవారం ఉదయం కేవియట్‌ దాఖలు చేసింది.

పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోబోయే ముందు తమ వాదనలు వినాలంటూ (Hear Us Before Taking Any Decision) అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది కేంద్రం. అయితే కేవియట్‌లో ప్రత్యేకించి ఎలాంటి అభ్యర్థనను చేయలేదు. కేవలం తమ చెప్పింది మాత్రం పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం కోరడం విశేషం. అడ్వకేట్‌ హర్ష్‌ అజయ్‌ సింగ్‌, లాయర్లు ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీలు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ముందుగా ఇది తప్పనిసరి, తాజా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆర్మీ, జూలై నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

పార్లమెంట్‌లో చర్చించి ఆమోదం పొందకుండానే కేంద్రం దీన్ని తీసుకొచ్చిందని పిటిషన్‌దారు అడ్వొకేట్‌ ఎం.ఎల్‌.శర్మ ఆరోపించారు. పథకాన్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఇక కేంద్రం అగ్నిపథ్‌ ప్రకటన వెలువడ్డాక.. జూన్‌ 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇక అగ్నిపథ్‌ పథకంతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఆరోపించారు. ఈ పథకం సైనిక దళాలను కించపర్చేలా ఉందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, ఇప్పుడు జనాన్ని వెర్రివెంగళప్పలను చేస్తోందని ధ్వజమెత్తారు.