Lucknow, November 19: దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం (Yogi Adityanath government)అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఆగ్రా (AGRA) కూడా చేరనుంది. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆగ్రా పేరు మార్పుపై కసరత్తు సాగిస్తోంది. ఆగ్రాకు ‘అగ్రవాన్’ అనే పేరు (Agra To Be Called Agravan)పెట్టాలని సూచించింది. దీనికోసం తాజ్‌నగరి చరిత్రను వెదికే పనిని చేపట్టింది.
ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చిందనే దానిపై పరిశోధనలు సాగించింది. విశ్వవిద్యాలయంలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం తాజ్ నగర్‌కు మొదట్లో అగ్రవాన్ అనే పేరు ఉండేదని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన సాక్ష్యాలను వెలికితీయనున్నారు. మహాభారత కాలానికి ముందు ఆగ్రాను అగ్రవాన్ లేదా అగ్రబాణ్ అని పిలిచేవారట.
ఇదిలా ఉంటే ఆగ్రాకు పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. తాజ్‌మహల్ ఇక్కడే ఉండటంతో పేరు మార్చితే పర్యాటకంగా నష్టపోతామని కొందరు అంటున్నారు. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మార్చారు.
ఇప్పుడు ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు వర్సిటీలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ పరిశోధనలు ప్రారంభించారు.ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తున్నట్టు ప్రొఫెసర్ ఆనంద్ తెలిపారు.