Ahmedabad, Mar 16; అహ్మదాబాద్‌లోని మెమ్‌నగర్ ప్రాంతంలో తన ఇంటి దగ్గర ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న 20 ఏళ్ల మహిళపై (woman in Memnagar) ముగ్గురు వ్యక్తులు వేధించారు. సోమవారం నరన్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి (Ahmedabad Shocker) వచ్చింది. మార్చి 8న రాత్రి తమ వీధిలో తాను ఒంటరిగా వాకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు తనను వెంబడించి వేధింపులకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తాను ప్రతిఘటించడంతో ఓ వ్యక్తి అభ్యంతరకరంగా వ్యవహరించగా మరో ఇద్దరు కూడా లైంగిక వేధింపులకు (verbally abuse woman) పాల్పడ్డారని తెలిపింది. ఈలోగా తాను తన సోదరుడిని పిలవగా ముగ్గురు నిందితులు అతడిని నెట్టివేసి (threaten brother) గాయపరిచారని వెల్లడించింది. అడ్డుకున్న తనపై దాడి చేసి దుస్తులు చించేశారని పేర్కొంది. దీంతో పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేసి నిందితులపై ఫిర్యాదు చేశానని వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిందితులను రాజ్ వర్మ, విష్ణు వర్మ, మయూర్ కటారాగా గుర్తించారు. నిందితుడు మహిళ వద్దకు వెళ్లడంతో, ఆమె తన తమ్ముడిని పిలిచింది. బాధితురాలి సోదరుడు ఆమెను రక్షించడానికి వచ్చినప్పుడు, ముగ్గురు వ్యక్తులు అతనిని కొట్టడం ప్రారంభించారు, దీని ఫలితంగా అతని తల, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలుక జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా, వారు ఆమెను కూడా కొట్టి, ఆమె బట్టలు చింపేశారు. ఇంతలో, ఆమె వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి కేసుకు సంబంధించి అధికారిక ఫిర్యాదు చేసింది.