Rajasthan Shocker: స్కూలులో కామాంధుడు, క్లాస్ రూంలో అక్కపై రేప్, ఆ తర్వాత చెల్లెలిని రూంలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు
Image used for representational purpose only | (Photo Credits: ANI)

Jaipur, March 15: రాజస్థాన్‌ నాగోర్ పట్టణంలోని పంచోరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన (Rajasthan Shocker) చోటుచేసుకుంది. బాధితుల స్టేట్‌మెంట్‌ ప్రకారం.. ఓ కుటుంబంలోని పెద్దమ్మాయి 2018లో 9వ తరగతి చదువుతుండగా ఓ రోజు పీఈటీ హరిరామ్ (30) (physical education teacher ) ఆమెను ఖాళీ తరగతి గదిలోకి తీసుకెళ్లి ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. మళ్లీ 10వ తరగతి చదువుతున్న టైంలో కూడా హరిరామ్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక భయపడిపోయి స్కూలు మానేసింది. కానీ, తల్లిదండ్రులకు జరిగింది చెప్పలేకపోయింది.

తాజాగా ఈ నెల 5న అదే స్కూల్‌లో చదువుతున్న సదరు బాలిక చెల్లెలిపైనా అదే పీఈటీ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ విషయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పి వాపోయింది. దీంతో పెద్దమ్మాయి కూడా తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలిజేసింది. దీంతో ఆ పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు (Teacher arrested for raping student) చేస్తున్నారు.

మందు మానేయమన్న అక్క, కోపంతో ఆమెను దారుణంగా కాల్చి చంపేసిన తమ్ముడు, గ్రేటర్ నోయిడాలో దారుణం

టీచర్ చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలికల స్టేట్ మెంట్ తీసుకున్నారు. సదరు దుర్మార్గుడి చేతిలో ఇంకెంత మంది విద్యార్థులు మోసపోయారన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసు వివరాలను పంచోరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అబ్దుల్ రౌఫ్ తెలియజేశారు.